Visakha News : విశాఖలో పెళ్లింట విషాదం, జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో వధువు మృతి
Visakha News : విశాఖలో పెళ్లింట విషాదం జరిగింది. జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో ఒక్కసారిగా వధువు కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
Visakha News : విశాఖలోని మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి తంతులో జీలకర్ర బెల్లం తలమీద పెడుతున్న సమయంలో వధువు మృతి చెందిన తీవ్ర విషాద ఘటన జరిగింది. వరుడు తెలుగు యువత అధ్యక్షుడు శివాజీతో సృజన అనే యువతికి వివాహం కుదిరింది. ఇరువురికీ ఇవాళ వివాహం జరుగుతుంది. ముహూర్త సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు స్పృహ తప్పి పడిపోవడంతో వధువును వెంటనే ఆసుపత్రికి తరలించారు బంధువులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వధువు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
పెళ్లిపీఠలపై ఒక్కసారి కుప్పకూలిన వధువు
వధూవరులకు బుధవారం రాత్రి రిసెప్షన్ జరిగింది. గురువారం తెల్లవారిజామున వివాహం జరిగాల్సిఉంది. దీంతో పెళ్లి ఏర్పాట్లు అన్ని పూర్తిచేసి వివాహం చేసుకోవడానికి ఇద్దరు పెళ్లి పీఠలు ఎక్కారు. జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో ఒక్కసారిగా వధువు నేలకూలింది. దీంతో వివాహ వేడుకలో ఇలా జరగడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా వధువు మృతి చెందడం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాధ ఘటనతో బంధువులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. వధువు మృతికి కారణం తెలియాల్సి ఉంది.
అసలేం జరిగింది?
పెళ్లంటే నూరేళ్ల పంట, ఎంతో అందమైన జీవితం ఊహించుకుంది ఆ యువతి. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిసెప్సన్ కూడా నిర్వహించారు. ఇంకా కొన్ని నిమిషాల్లో తన జీవితంలో మరిచిపోలేని క్షణాలు. పుట్టింటి నుంచి అత్తంటికి వెళ్లే మధురమైన సమయం. కుటుంబ ఎంతో ఆనందంగా ఉన్నారు. కొత్త బాధ్యతలు, సంబంధాలు ఇలా ఎన్నో ఆలోచనలు. ముహూర్త సమయం దగ్గరపడింది. ఇలా అన్ని ఆలోచనలతో పెళ్లి పీటలపైకి కూర్చుంది నవ వధువు సృజన. ఆమె ఊహలన్నీ అంతలోనే ఆవిరైపోయాయి. కన్న కూతురుకి వైభవంగా పెళ్లి చేసి అత్తింటికి పంపించాలని భావించిన ఆ తల్లిదండ్రులు విషాధంలో మునిగిపోయే ఘటన చోటుచేసుకుంది.
క్షణాల్లోనే అంతా
భారీ సెట్టింగ్ తో పెళ్లి మండడం, అతిథులు, కుటుంబ సభ్యులు అందరి మధ్య ఎంతో గ్రాండ్ గా వివాహం జరుగుతుంది. పెళ్లి మండపం అంతా సందడిగా ఉంది. వధువు, వరుడు పెళ్లిపీఠలపై కూర్చున్నారు. బంధువులను పలకరిస్తూ, ఎంతో ఆనందంగా ఉన్న ఆ జంటనను ఆశీర్వదించడానికి అందరూ సిద్ధం అయ్యారు. జీలకర్ర బెల్లం పెట్ట గడియ సమీపించింది. దీంతో పురోహితులు వాయిద్యాలు చెప్పి వరుడికి జీలకర్ర బెల్లం అందించాడు. వరుడు ఎంతో ఆనందంతో వధువు తలపై జీలకర్ర బెల్లం పెడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా అందరూ షాక్. నవ వధువు పెళ్లి పీఠలపైనే స్పృహ కోల్పోయింది. అందరూ కంగారు పడ్డారు. నీరసంతో అలా జరిగిందేమోనని భావించారు. కాసేపు లేపేందుకు ప్రయత్నించారు. వధువుకు స్పృహ రాకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా రెండు కుటుంబాల్లో విషాదం. అంతా క్షణాల్లో జరిగిపోయిందని కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.
పెళ్లి కొడుకు ఆత్మహత్య
పెళ్లి కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జై ఆంధ్ర కాలనీలో ఈ ఘటన జరిగింది. దినేష్ అనే యువకుడికి బుధవారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇంట్లో అంతా పెళ్లి పనుల్లో ఉండగా దినేష్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో జై ఆంధ్ర కాలనీలో విషాదం నెలకొంది. సంఘటనా స్థలాన్ని మల్కాపురం పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం దినేష్ మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.