Minister Gudivada Amarnath : అది ఫోన్ ట్యాపింగ్ కాదు కాల్ రికార్డింగ్, కోటంరెడ్డికి మంత్రి అమర్నాథ్ కౌంటర్
Minister Gudivada Amarnath : ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మార్చి 3, 4న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కోటంరెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ కాదని రికార్డింగ్ అన్నారు.
Minister Gudivada Amarnath : విశాఖ వేదికగా మార్చి 3,4,తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తున్నామని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. నిన్న దేశ రాజధానిలో కర్టెన్ రెజైర్ ప్రోగ్రామ్ లో 49 దేశాల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. నిన్నటి సమావేశంలో రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాల గురించి సీఎం జగన్ ఆయా ప్రతినిధులకు వివరించారన్నారు. దేశంలో 11 ఇండస్ట్రీయల్ కారిడార్లు వస్తున్నాయని, వాటిలో మూడు కస్టర్లు ఏపీకి వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ ఇండస్ట్రీయల్ కారిడార్ల కోసం 49 వేల ఏకరాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది వర్క్ పోర్స్ జనాభా ఉందని తెలిపారు. చిన్న తరహ పరిశ్రమలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు.
పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లు
అలాగే 69 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఏపీ పారిశ్రామిక విధానాలను కోనియాడారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని ప్రపంచానికి తెలియ జెప్పే క్రమంలోనే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఏపీలోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారన్నారు.
కొత్త బిల్లుతో రాజధాని విశాఖకు
"ఏపీలో నూతనంగా 4 పోర్టులు నిర్మాణాలు చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఫిషింగ్ హర్బర్ లు ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర భవిష్యత్తు మార్చేది విశాఖనే. రాష్ట్ర భవిష్యత్తుకు వేదిక విశాఖ కాబోతుంది. ముఖ్యమంత్రి స్వయంగా విశాఖ వస్తున్నానని చెప్పారు. జీ 20 గ్లోబల్ సమ్మిట్ తో విశాఖ రూపు మారుతుంది. కొత్త బిల్లుతో రాజధాని విశాఖకు తరలిస్తాం. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు భవనాలు తీసుకుంటాం. " - మంత్రి గుడివాడ అమర్నాథ్
ట్యాపింగ్ కాదు రికార్డింగ్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెట్టి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఫోన్లలో అనేక యాప్ లు ఉన్నాయని, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మూడో వ్యక్తి రికార్డు చేస్తే అది ట్యాపింగ్ అవుతుందన్నారు. ఇద్దరు వ్యక్తుల సంభాషణ బయటకు వచ్చిదంటే ఎవరో ఒకరు రికార్డు చేసినట్లే అన్నారు. దానిని ప్రభుత్వపై రుద్ది రాద్ధంతం చెయ్యడం మంచిది కాదన్నారు.
ఆ 600 ఎకరాలు పవన్ ఇచ్చేస్తా
కేంద్రమే రాజధాని ఆంశం అనేది రాష్ట్రాల ఇష్టం అని చెప్పిందని మంత్రి గుడివాడ అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవీఎల్ ఇది తెలుసుకోవాలని సూచించారు. సీట్లు కోసం భేరాలు పెట్టే పార్టీ పార్టీనా అంటూ జనసేనపై విమర్శలు చేశారు. 25 సీట్లలో పోటీ చేసే పవన్ కల్యాణ్ ఇంకా ముఖ్యమంత్రి ఏం అవుతారని ఎద్దేవా చేశారు. తాను 600 ఎకరాలు బినామీ పేర్లతో సంపాదించానని నిరూపిస్తే అదంతా పవన్ కు రాసిస్తానన్నారు.