MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్
MP GVL Narsimharao : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే టీడీపీ, వైసీపీ హడావుడి చేస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు.
MP GVL Narsimharao : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం డబ్బులూ ఇస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగాల్బాలు ఏంటీ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఏ నీటి ప్రాజెక్ట్ కట్టారో చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో దశాబ్దాల కాలంగా పెండింగ్ లో వంశధార, తోటపల్లి, దక్షిణాంధ్రలో వెలుగోడు ప్రాజెక్ట్ లు సంగతి ఏంటని ప్రశ్నించారు. రిపైర్ కూడా చేయడం లేదన్నారు. పోలవరంపై సొంత ప్రతాపం ఎందుకన్నారు. వైసీపీ కూడా అదే బాటలోనే పయనిస్తుందని విమర్శించారు. స్టేట్ ప్రాజెక్ట్ లలో చంద్రబాబు ఏంచేశారని నిలదీశారు. బీజేపీ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టీ నివేదిక తయారు చేశామన్నారు. మీరు ఏమి చేశారో చర్చకు సిద్ధమా? అని జీవీఎల్ సవాల్ చేశారు. పోలవరం విషయంలో రెండు పార్టీలు కమిషన్ లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై త్వరలోనే మిమ్మల్ని పిలుస్తాం చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, ధర్మాన లాలూచీ
"భూకబ్జాల విషయంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు దొంగలే. రెండు సిట్ లు వేశారు. ఆ రిపోర్ట్ ఎందుకు బహిర్గతం చేయలేదు. ధర్మాన ప్రసాదరావు ఎలా భూములు కొట్టేశారో వివరంగా మీడియాలో వస్తోంది. చంద్రబాబు, ధర్మానతో ఏం లాలూచీ ఉంది. ఇప్పుడు వైసీపీ ఎందుకు దాస్తుంది. ఇద్దరూ దొంగలే. ఈ భూ దొంగలు సిట్ నివేదికలు బహిర్గతం చేసేలా గవర్నర్ కి విజ్ఞప్తి చేశాం. నా అభ్యర్థనను సీఎస్ కు పంపారు. కానీ ఇప్పటికీ చర్యలు శూన్యం. మరోసారి గవర్నర్ కి కలుస్తాం. సోము వీర్రాజు సీఎంకు లేఖ కూడా రాశారు. ఈ రెండు విషయాలలో బీజేపీ పోరుకొనసాగిస్తుంది. బీజేపీకి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. అయ్యన్న పాత్రుడు కూడా సిట్ కి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆయన ఎందుకు నిశబ్దం అయ్యారు. అప్పుడు మాట్లాడి ఇప్పుడు సైలెంట్ అయ్యారో వారిని కూడా అనుమానించాలి. కోర్టులు ద్వారా కూడా ఫైట్ చేస్తాం." - ఎంపీ జీవీఎల్
విశాఖ నుంచి వందే భారత్ ట్రైన్స్
జనం కోసం జల పోరు యాత్ర చేస్తున్నామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. జనసేన, బీజేపీ మధ్య ఎలాంటి ఇబ్బందులూ లేవన్నారు. జీ 20కి అన్నీ పార్టీ లకు ఆహ్వానం ఇచ్చారని తెలిపారు. దానిలో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం పంపారన్నారు. ఆజాద్ అమృత మహోత్సవానికి పిలిచామన్నారు. ఏపీలో 5జీ సేవలు ఏప్రిల్ నుండి అమలు చేయడానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. వందే భారత్ ట్రైన్ విశాఖ నుంచి నడుస్తుందన్నారు. తిరుపతి, బెంగళూర్, హైదరాబాద్ కి విశాఖ నుంచి మూడు ట్రైన్ లకు కేంద్రమంత్రి సముఖత చూపారని జీవీఎల్ చెప్పారు. జోన్ పనులు త్వరగా చేయలని రైల్వే మంత్రిని కోరామన్నారు. ఐటీ హబ్ గా విశాఖ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. మోదీ అంటే బీజేపీ ప్రథమ నాయకుడు అని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ ఆయన్ని కలిస్తే మమ్మల్నీ కలిసినట్లే అని తెలిపారు. వైసీపీని ప్రధాన ప్రతి పక్షంగా తమ కూటమి పనిచేస్తుందన్నారు. అన్నీ రాష్ట్రాలకు వస్తున్న దాని కంటే ఏపీకి ప్రత్యే కంగా కేంద్రం ఇస్తుందన్నారు. విశాఖలో ప్రధాని సభకు అయిన ఖర్చులో అధిక శాతం కేంద్ర నిధులు ఖర్చుపెట్టారని తెలిపారు. దీనికి ఎవరైనా స్టిక్కర్ వేసుకుంటే దానికి తాము ఏంచేయలేమన్నారు. పన్నులు రూపేణా రాష్ట్రాలు ఇచ్చి న డబ్బుల కన్నా అధికంగా కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చిందన్నారు.