అన్వేషించండి

లోకేష్‌ ఎంట్రీతో విజయవాడ టీడీపీలో విభేదాలకు చెక్‌ పడుతుందా!

టీడీపీ నేతల తీరు పట్ల ఎంపీ కేశినేని నాని తీవ్ర అసహనంతో ఉంటున్నారు. 19వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోకి లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇవ్వనుంది. ఈ పరిస్థితుల్లో పరిణామాలపై ఆసక్తిగా మారింది.

ఈనెల 19వ తేదీన బెజవాడలోకి యువ గళం పాదయాత్ర ద్వార లోకేష్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఇదే సమయంలో కీలకంగా ఉండాల్సిన పార్టీ పార్లమెంట్ సభ్యుడు చేతులు ఎత్తేయటం చర్చ నీయాశంగా మారింది.

లోకేష్ యువగళంకు భారీ ఏర్పాట్లు...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా యువ గళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర 19వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు తెలుగు దేశం పార్టీకి చెందిన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం నుంచి లోకేష్ గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజ్‌ మీదగా విజయవాడలోకి ఎంట్రీ ఇస్తారు. ఈ సందర్బంగా లోకేష్‌కు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు క్యాడర్ ఫుల్ జోష్‌తో ఏర్పాట్లు చేస్తున్నారు. 

పార్టీలో ఇబ్బందిగా మారిన విభేదాలు...
రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర చేస్తూ అధికారం చేపట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే గల్లీ స్థాయిలో మాత్రం పార్టీ నాయకులు, విభేదాలు ఇబ్బందిగా మారాయి. ఈ వ్యవహరమే గత ఎన్నికల్లో పార్టీని పరాజయంపాలు చేశాయి. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా పార్టీ నాయకులు మాత్రం విభేదాల విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఈ విభేదాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విభేదాలను పరిష్కరిస్తున్న తన పాదయాత్రలో నాయకులు కలుపుకొని ఎలా ముందుకు వెళతారనేది సర్వత్రా చర్చనీయాశంగా మారింది.

పరాజయాలకు నాయకులే కారణమా...
తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే అండగా ఉంటున్నారు. అయితే నాయకులు తీరుతో కార్యకర్తలు కూడా పక్క చూపులు చూడక తప్పటం లేదు. ఇందుకు గత మున్సిపల్ఎన్నికలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి వ్యతిరేకంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తిరుబాటు చేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం ఘోరంగా పరాజయం పాలయ్యింది. కార్పోరేషన్ పరిధిలో బలమయిన క్యాడర్ ఉన్నా, నాయకుల మధ్య విభేదాలు పార్టీని దెబ్బతీశాయి.

చేతులు ఎత్తేసిన ఎంపీ...
గత ఎన్నికల్లో నేతల తీరు పట్ల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కేశినేని నాని తీవ్ర అసహనంగా పార్టీలో ఉంటున్నారు. పార్టీలో ఉన్న నాయకులు తనను కాదని ఎదురు తిరగటం వలనే విజయం సాధించలేకపోయామనే భావనలో కేశినేని నాని ఉన్నారు. అంతే కాదు తనకు వ్యతిరేకంగా తిరుబాటు చేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు అప్పట్లో లోకేష్ సపోర్ట్ చేశారని, ఆయన అండతోనే అంతగా వారంతా రెచ్చిపోయారనే అభిప్రాయం కేశినేనిలో ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. 

లోకేష్ పాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఖర్చులు భరించాలని పార్టీ నాయకత్వం నుంచి సంకేతాలు వచ్చినా ఆయన ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎంట్రీ నాటికి తరువాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, పాదయాత్రగా వచ్చిన లోకేష్ ఈ విభేదాలకు ఎలాంటి మార్గాలు చూపుతారనేది చర్చగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు చల్లటి కబురు! ఏపీ, తెలంగామలోని జిల్లాల్లో వర్షాలు!
ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు చల్లటి కబురు! ఏపీ, తెలంగామలోని జిల్లాల్లో వర్షాలు!
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
Ajith Kumar : అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
Ram Charan : రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
Full Case Study: 22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
Embed widget