Kesineni Nani: టీడీపీలో ప్రక్షాళన జరగాలి - సోదరుడికి మద్దతు ఇచ్చేది లేదని ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
MP Kesineni Nani Comments: క్యారెక్టర్ ఉన్న వారు పేదవాడయినా నెత్తిన పెట్టుకుంటానని, తన సోదరుడు కేశినేని చిన్నికి చస్తే మద్దతు ఇవ్వనని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.
MP Kesineni Nani Comments: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కేశినేని చిన్నికి చస్తే మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. క్యారెక్టర్ ఉన్న వారు పేదవాడయినా నెత్తిన పెట్టుకుంటానన్నారు. భూ కబ్జాదారులకు, సెక్స్ రాకెట్ నడిపే వారికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. అయితే అలాంటి వారు పార్టిలో ఉన్నారు కదా అని మీడియా ప్రశ్నించగా, అది పార్టీని అడగాలన్నారు. తాను మాత్రం జనాన్నిమోసం చేయటానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.
పార్టీ ఎవరికైనా టికెట్, మద్దతు ఇవ్వొచ్చునని, మాఫియా డాన్ లకు సైతం ఇవ్వొచ్చు అన్నారు. గాంధీకైనా, రఘురామ లాంటి వ్యక్తులకు పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, కానీ తన సోదరుడికి మాత్రం మద్దుతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. రియల్ ఎస్టేట్ మోసాలు, పేకాట క్లబ్బులు నడిపేవారికి, సెక్స్ రాకెట్ నడిపే వారికి, కాల్ మనీ రాకెట్ నడిపే వారికి తాను మద్దతు ఇవ్వనంటూ సోదరుడు కేశినేని నానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయంగా తనకు స్పష్టత ఉందని, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో తనకు తెలుసునన్నారు. నా జీవితంలో నేను ఎవరిని మోసం చేయలేదు అన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని.
అలాంటి వ్యక్తులకు పార్టీ మద్దతు ఇస్తుందని, దానిపై ఎంపీ కేశినేని నాని అభిప్రాయం కోరగా.. పార్టీలో ఎవరైనా తిరగొచ్చునని, దావూద్ ఇబ్రహం ఉండొచ్చు, కాల్ మనీ, సెక్స్ రాకెట్ చేసేవాళ్లు, చార్లెస్ శోభరాజ్ లాంటి ఎవరైనా పార్టీలో తిరగొచ్చు అన్నారు. అలాంటి వ్యక్తులకు పార్టీ టికెట్ ఇస్తే తన మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. మరో 3 మంది నేతలు ఉన్నారని, తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎన్నో గొప్ప ఆశయాలు, సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీ టీడీపీ అన్నారు. అయితే ఎవరికి పడితే వారికి పార్టీ టికెట్లు ఇచ్చి సిద్ధాంతాలను దెబ్బ తీయవద్దు అని విజ్ఞప్తి చేశారు. కొందరు నేతలకు టికెట్ ఇస్తే మాత్రం పార్టీ కోసం కచ్చితంగా పనిచేయనని ఎంపీ కేశినేని నాని తేల్చి చెప్పేశారు.
కేశినేని నాని కుటుంబంలో ముదురుతున్న వివాదం..
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుటుంబంలో ఏర్పడిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. గతంలో కేశినేని చిన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వెంటనే ఎప్పుడూ నాని వెంట ఉండే క్యాడర్ అంతా చిన్ని ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యారు. కేశినేని నాని కంటే... వారంతా చిన్నీతోనే నడిచేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతే కాదు చిన్నికూడ ఫుల్ డేర్ గా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న,నాగుల్ మీరా తో పాటుగా ఇతర మాజీ ఎమ్మెల్యేలు కూడ చిన్నికి ఫోన్ చేసి మరి మాట్లాడారని అంటున్నారు.
విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఈ పరిణామలు ఆసక్తి కరంగా మారాయి. కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న క్యాడర్ అంతా ఇప్పుడు చిన్ని కి దగ్గర కావటం,అటు కేశినేని కూడ చంద్రబాబు సహా ఇతర నాయకులు పై కూడ హాట్ కామెంట్స్ చేశారని ప్రచారం జరగుతూండటం మైనస్‌గా మారింది. రాజకీయాల్లో దూకుడుగా ఉండే కేశినేని నాని పార్టీ ఓడిపోయిన తర్వాత పలుమార్సలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. తాను రాజకీయాలకు దూరమని ఓ సారి ప్రకటించారు. అయితే తర్వాత మళ్లీ సర్దుకున్నారు.