Godavari Express: గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో పొగలు, ప్యాసింజర్లను హడలెత్తించిన ఎలుక
smoke in Godavari Express: గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో ఎలుక కలకలం రేపింది. ఎలుక వల్ల పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
smoke in Godavari Express: ఈ మధ్య రైలు ప్రయాణాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఒడిశా రైలు ప్రమాదం తరువాత పలు రాష్ట్రాల్లో వరుసగా చిన్న చిన్న రైలు ప్రమాదాలు జరిగాయి. తాజాగా గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో ఎలుక కలకలం రేపింది. హైదరాబాద్ (Hyderabad ) నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ట్రైన్ నంబర్ 12728లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలులోని 3rd AC coach B4 కంపార్ట్ మెంట్లో క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడంతో పొగలు వచ్చాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో జరిగింది.
ఖమ్మం విజయవాడ మధ్యలో బోనకల్ స్టేషన్ దగ్గరకు రాగానే ఏసీ కోచ్ లో పొగలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా రైలు నిలిపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఏం జరిగిందో చెక్ చేసిన సిబ్బంది.. ఎలుకను బయటకు తీశారు. అంతా ఓకే అయ్యాక అరగంట సమయంలోనే రైలు తిరిగి బయలు దేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.