By: Harish | Updated at : 01 Feb 2023 07:07 PM (IST)
నెల్లూరు పరిమాణాలపై సీఎం జగన్ తో సజ్జల చర్చలు
Sajjala : వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా బయట పడుతున్న వివాదాల పై అధిష్టానం దృష్టి సారిచింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారంతో పాటు నెల్లూరు జిల్లా కేంద్రంగా వెలుగు చూస్తున్న పార్టీ అంశాల పై ముఖ్యమంత్రి జగన్ తో ప్రభుత్వ సలహా దారు సజ్జల సమావేశం అయ్యారు. కోటంరెడ్డి టీడీపీ లోకి వెళ్లడానికి ఫిక్స్ అయిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సజ్జల అంటున్నారు. టీడీపీ లోకి వెళుతున్నానని కోటంరెడ్డి స్వయంగా చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చెయ్యాల్సి న అవసరం తమ ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందని సజ్జల అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకొని పాలన చేస్తున్నారని సజ్జల అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లా పై ఎవరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని పేర్కోన్నారు.
వివేక హత్య కేసులో సీబీఐ విచారణ పై సజ్జల వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ ఒక వైపు జరుగుతుంటే మరో వైపు అత్యంత దారుణంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. నవీన్ అనే వ్యక్తిని ఉద్దేశించి చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రమేయంతోనే ఇటువంటివి అన్ని క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. వివేక హత్య జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని అప్పుడు కూడా సిట్ విచారణ జరిగిందని సజ్జల గుర్తుచేశారు. అప్పుడు కూడా నవీన్ వ్యవహారం పై చర్చ జరిగిందని గుర్తుచేశారు.
రాజధాని అమరావతి విషయంలో ఢిల్లీ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని సజ్జల అన్నారు. భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పెట్టుబడిదారులను రాజధాని విశాఖకు ఆహ్వానించేందుకు జగన్ ప్రకటన చేశారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు జగన్ చేసిన ప్రకటనకు సంబంధం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. రాజధాని పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా చేస్తున్న ప్రకటనలు ప్రజలను గందరగోళ పర్చడానికేనని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల పై కేంద్ర పార్టీ కార్యాలయం నుండి పార్టీ పెద్దలు ఆరా తీశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల నెల్లూరు జిల్లా పార్టీ నాయకులతో సజ్జల ఫోన్ లో మాట్లాడారు. ఆనం, కోటమ్ రెడ్డి ఎపిసోడ్ లో చోటుచేసుకున్న పరిణామాల పై సజ్జల నాయకుల నుంచి వివరాలను అడిగారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కోటమ్ రెడ్డి కామెంట్స్ వెనుక పరిణామాలు కూడా జీల్లా పార్టీ నాయకుల సజ్జలకి వివరాలను అందించినట్లు గా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు రూరల్‌కి కొత్త ఇంచార్జిని నియమించాలని నిర్ణయించారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు.
నెల్లూరులో మరో ఎమ్మల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో వైసీపీలో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో ఆ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోందన్న దానిపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
AP CM వైఎస్ జగన్ ను మోసం చేసినవాళ్లు కనుమరుగు అయ్యారు: మంత్రి నాగార్జున
AP CM Delhi Visit: రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ - మరోసారి ప్రధానితో భేటీ?
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్లో అందరికీ 2 మార్కులు!
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ
Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి