అన్వేషించండి

Posani Krishna Murali: తేడాగా లోకేశ్ వ్యాఖ్యలు, అంత నీచంగా ఎవరూ మాట్లాడరు - పోసాని, పురంధేశ్వరిపై కూడా

ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని, అలాంటి వ్యక్తితో పురంధేశ్వరి సఖ్యతగా ఉండడం ఏంటని పోసాని కృష్ణమురళి నిలదీశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని, అలాంటి వ్యక్తితో పురంధేశ్వరి సఖ్యతగా ఉండడం ఏంటని నిలదీశారు. అప్పట్లో చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, చంద్రబాబు అలవాట్లు అన్నీ ఇప్పుడు నారా లోకేశ్‌కు వచ్చాయని ఎద్దేవా చేశారు. లోకేశ్‌ తేడాగా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌ అంత నీచంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలకు పథకాలు ఇస్తామంటుంటే చంద్రబాబు, లోకేశ్‌ బూతులు తిడుతున్నారని అన్నారు. 

పాతరోజుల్లో ఎన్టీఆర్‌ ముఖం మీదే చంద్రబాబు చెప్పులు వేయించారని.. అలాంటి ఎన్టీఆర్‌ను చంపేసి ఇప్పుడు దండలు వేయడం సిగ్గుచేటని అన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబును.. పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పురంధేశ్వరి, ఎన్టీఆర్‌ కొడుకులు తండ్రిని అవమానిస్తే ప్రశ్నించరా? అని నిలదీశారు. ఎన్టీఆర్‌ గొప్ప నటుడు అని, ఆయన్ని అవమానించిన వెన్నుపోటుదారుడు చంద్రబాబు అని అన్నారు. విజయవాడలో వంగవీటి రంగాను చంపింది కూడా చంద్రబాబే అని ఆరోపించారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అవినీతిపరుడని అన్నారు. తనపై నరేంద్ర చేసిన ఆరోపణపై బహిరంగ చర్చకు సవాల్‌ చేస్తున్నానని అన్నారు. గుడిలో ప్రమాణం చేయడానికి కూడా నరేంద్ర సిద్ధమేనా అని ప్రశ్నించారు. 

ఇటీవల పుంగనూరులోను పోలీసులను రౌడీలతో చంద్రబాబు కొట్టించారని అన్నారు. సిగ్గులేకుండా పోలీసులను కొట్టించి.. లోకేశ్‌లు పోలీసు సెక్యూరిటీతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసం రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు అడ్డమైన పనులు చేస్తున్నారని విమర్శించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Embed widget