NTR District News: ఆ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ తరగతులు చెప్పరు కానీ ఒళ్లంతా తడిమేస్తూ గలీజు పనులు!
NTR District News: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినిలు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. క్లాసులు చెప్పడం మానేసి ఒళ్లంతా తడమడం ప్రారంభించాడు.
NTR District News: అతనో నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్. విద్యార్థులు విద్యతో పాటు మంచి బుద్ధులు నేర్పించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన అతడే వంకర బుద్ధి చూపించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఒళ్లంతా తడుముతూ వారిని వేధింపులకు గురి చేశాడని విద్యార్థులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ధర్నాకి దిగాయి.
అసలేం జరిగిందంటే?
ఎన్టీఆర్ జిల్లా అజిత్ సింగ్ నగర్ లో ని నవోదయ నర్సింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు. గత ఆరేళ్లుగా సాగుతున్న ఈ కళాశాలకు ప్రన్సిపాల్, ఛైర్మన్ గా రవీంద్రా రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కాలేజీలో రాజమండ్రి, అల్లూరి సీతారామారాజ్, తెలంగాణలోని భద్రాచలం జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థినులు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం స్టాఫ్ నర్స్ కోర్సులు అభ్యసిస్తున్నారు. అయితే వేసవి కాలం కావడంతో సెలువులు ఉన్నప్పటికీ.. గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అక్కడే హాస్టల్ లోనే ఉంటూ చుదవుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని ఈ సంవత్సరం జనవరిలో కాలేజీలో జాయిన్ అయింది. అయితే కొన్ని వారాల కిందట ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఆ కాలేజీలో చదవనని చెప్పి.. ఇంటికి వచ్చేస్తానని వివరించింది.
కాలేజీకి వెళ్లిన వ్యక్తితో తమ బాధను తెలిపిన విద్యార్థినులు
అయితే ఎప్పుడూ అలా చెప్పని కూతురు ఒక్కసారిగా కాలేజీ మారుతానని చెప్పడంతో.. తల్లిదండ్రులు కళాశాలకు దగ్గర్లో ఉన్న తమ బంధువులకు ఫోన్ చేసి పాపను తీసుకెళ్లాల్సిందిగా కోరారు. అయితే వెంటనే కాలీజే హాస్టల్ కు వెళ్లిన ఓ వ్యక్తికి.. విద్యార్థిని కాలేజీలో జరుగుతున్న పలు విషయాల గురించి తెలిపింది. రోజంతా ఒక్క క్లాసు కూడా చెప్పకుండా.. అర్థరాత్రులు తరగతులు పెడుతూ వేధిస్తున్నాడని వివరించింది. ప్రన్సిపాల్ యే ఛైర్మన్ గా ఉండడంతో తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని తెలియట్లేదని వాపోయింది. ఈ విద్యార్థినితోపాటు మరికొంత మంది కూడా ఇలాగే చెప్పడంతో.. వచ్చిన వ్యక్తి సదరు విద్యార్థిని టీసీ ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి ఒప్పుకోకపోవడంతో గొడవ జరిగింది.
రంగంలోకి దిగి ప్రిన్సిపల్ పై పోక్సో కేసు పెట్టాలంటున్న విద్యార్థి సంఘాలు
బయటకు వచ్చిన వ్యక్తి ప్రిన్సిపాల్ అరాచకాల గురించి విద్యార్థి సంఘాల నాయకులకు చెప్పడంతో ధర్నా ప్రారంభించారు. పీఓడబల్యూ రాష్ట్ర కార్యదర్సి పద్మ, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవిచంద్ర, రాజేశ్ లు బాధితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. రవీంద్రరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గతేడాది అక్టోబర్ లో హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కీచక పర్వానికి తెరతీశాడు. బాలికను లైంగికంగా వేధించాడు. ఫోన్లు, మెసేజ్ లు చేస్తూ వికృతంగా ప్రవర్తించాడు. చివరికి జైలు పాలయ్యాడు. హైదరాబాద్ లో మైనర్ బాలికను వేధించిన పాఠశాల ఉపాధ్యాయుడికి పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 25 ఏళ్ల యాచారం రమేష్ అనే ఉపాధ్యాయుడు 17 ఏళ్ల బాలికను వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని బాలిక ఇంటికి కూడా వెళ్లి బెదిరించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు రమేష్ ను హెచ్చరించి వదిలేశారు. మరోసారి అలా చేస్తే పోలీసు కేసు పెడతామని బెదిరించారు. బాలిక నుండి వచ్చిన బెదిరింపుల తర్వాత యాచారం రమేష్ మరింత రెచ్చిపోయాడు. మెసేజ్ లు, కాల్స్ చేస్తూ వేధిస్తూనే వచ్చాడు. గతంలోని కాల్ రికార్డింగ్ లను ఆమె కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో వారు రమేష్ పై మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు..
ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ అనంతరం ఉపాధ్యాయుడైన యాచారం రమేష్ ను పోక్సో కోర్టు (Hyderabad POCSO Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రమేష్ కు రూ. 20 వేలు జరిమానా విధించింది.