అన్వేషించండి

Balakrishna About NTR: మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు: బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఈ నిర్ణయంపై బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. 

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పేరు మార్పు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన సోదరి వైఎస్ షర్మిల సైతం ఖండించారు. ఆ నిర్ణయం కరెక్ట్ కాదని, ఒకరి ఖ్యాతిని తీసుకోవాల్సిన అవసరం వైఎస్సార్ కు లేదని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తాజాగా ఈ అంశంపై స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. 

సిగ్గులేని బతుకులు.. బాలకృష్ణ ఫైర్ 
మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఓ ప్రకటన విడుదల చేశారు. ‘
మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. 
తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..
కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు, పంచ భూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త.
అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..
శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు బాలయ్య. ఈ మేరకు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.

 

జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఇదీ.. 
''NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు'' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ.. 
1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూనివర్సిటీలను పరిశీలించి, వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా 1986 నవంబరు 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరుతో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు.

అప్పట్లో విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీ ప్రైవేటు కాలేజీగా ఉండేది. వైద్య, దంతవైద్య, నర్సింగ్‌, పారా మెడికల్‌ కళాశాలలైన 26 సంస్థలను కలిపి తొలుత యూనివర్సిటీ కార్యకలాపాలను మొదలుపెట్టారు. రాష్ట్రంలో వైద్యవిద్య కోర్సుల కాలేజీలు, అనుబంధ కాలేజీలు భారీగా పెరగడంతో 2000 నవంబరు 1న విశ్వవిద్యాలయాన్ని సిద్దార్థ వైద్య కాలేజీ నుంచి కొత్త బ్లాకులోకి అంటే ఇప్పుడు ఉన్న భవనంలోకి మార్చారు. ఎన్టీఆర్ ఆ యూనివర్సిటీని స్థాపించారు కాబట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 జనవరి 8న ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. మళ్లీ 2006 జనవరి 8న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేసింది.
Also Read: NTR: ఇలా చేస్తే YSR స్థాయి పెరగదు - ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs MI Match Highlights IPL 2024 | Travis Head | వార్నర్ లేని లోటును తీరుసున్న ట్రావెస్ హెడ్SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | కావ్య పాప నవ్వు కోసం యుద్ధం చేస్తున్న క్లాసెన్ | ABPSRH vs MI Match Highlights IPL 2024 | Hardik pandya | SRH, MI అంతా ఒక వైపు.. పాండ్య ఒక్కడే ఒకవైపు.!SRH vs MI Match Highlights IPL 2024: రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన ముంబయి, కెప్టెనే కారణమా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
Banking: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
Embed widget