By: ABP Desam | Updated at : 26 Apr 2022 01:51 PM (IST)
క్రిష్ణా నదిలో కుటుంబం నిరసన
Krishna River Protest: తన భర్త సంసారానికి పనికిరాడని తెలిసి తనకు పెళ్లి చేశారని ఆరోపిస్తూ ఓ బాధితురాలు ఏకంగా క్రిష్ణా నదిలో నిరసనకు దిగింది. ఆమెకు కుటుంబ సభ్యులు కూడా మద్దతు పలికారు. చందర్లపాడు మండలం ఏటూరు కృష్ణా నదిలో భార్య నిరసనకు దిగింది. గత నాలుగు సంవత్సరాల క్రితం చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ఓ మహిళ నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే శోభనం సమయంలో ఆ మూడు రాత్రులు తన వద్దకు రాకుండా ఉన్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ విషయం తన అత్తామామలకు చెప్తే తమ పరువు పోతుందని, బయటకు చెప్పదని బెదిరింపులకు గురి చేశాడని బాధితురాలు వాపోయింది.
తనకు విడాకులు కావాలని డిమాండ్ చేయడంతో గ్రామ పెద్దల సమక్షంలో తనకు రూ.15 లక్షలు ఇస్తానని తన అత్త మామలు ఒప్పుకున్నారని అన్నారు. చివరికు డబ్బు ఇవ్వకపోగా తమపై కోర్టుకు వెళ్ళి తమను ఇబ్బందులు గురి చేసి, తమపై పరువు నష్టం వేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరిగే వరకూ కృష్ణా నదిలో నీళ్ళు తాగి నిరసన చేపడతామని కుటుంబ సభ్యులు, బాధితురాలు వాపోయారు.
‘‘నా భర్త నాతో సంసారం చేయడం లేదు. ఇప్పటికి పెళ్లి జరిగి 4 సంవత్సరాలు జరిగింది. ఇదంతా నా భర్త చెల్లెలితో చెప్తే, ఈ విషయం బయటికి చెప్పొద్దని, చెప్తే తమ పరువు పోతుందని అన్నది. నేను గట్టిగా నిలదీస్తే నా భర్త ఆడవారిలా ఏడుస్తున్నాడు. నా దగ్గరికి రాకుండా.. ఎప్పుడూ దూరంగా ఉంటున్నాడు. పడుకునే సమయంలో అటు పక్కకు తిరిగి పడుకుంటున్నాడు. ఈ విషయం మా తల్లిదండ్రులతో చెప్తే వారు వచ్చి మాట్లాడారు. ఇక నుంచి బాగానే ఉంటారని చెప్పి వారిని పంపేశారు. ఇక ఆ తర్వాత నుంచి బ్లాంక్ పేపర్ల మీద నాతో ఏవో సంతకాలు తీసుకొని బయటికి ఈ విషయం చెప్తే సహించేది లేదని బెదిరించారు. ఇంకా అదనపు కట్నం కావాలని కూడా వేధించేవారు. నేను ఇంత కాలం భరించి నా తల్లిదండ్రులకు చెప్తే ఇలా నిరసన చేస్తున్నాం.’’ అని బాధితురాలు వాపోయారు.
క్రిష్ణా నదిలో నిరసన చేసేందుకు గల కారణాన్ని చెబుతూ.. వారి ఇంటి ముందు నిరసన చేస్తే పోలీసులకు చెప్పించి అడ్డుకుంటారని, అక్కడ ఎలాగూ న్యాయం జరగదు కాబట్టి, క్రిష్ణా నదిలో నిరసన తెలియజేస్తున్నట్లుగా వాపోయారు.
బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. పెళ్లి జరిగిన వెంటనే శోభనం జరిగిన రాత్రి తర్వాత ఆమె బొట్టు, పూలు చిందరవందర చేసుకోమని అతను కోరాడని చెప్పారు. ఆ తర్వాత తన నానమ్మ చనిపోయిందని, తనకు నచ్చిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బాధగా ఉందంటూ రకరకాల కారణాలు చెప్పి భార్యతో కలవకుండా ఉన్నాడని వివరించారు. 2 సంవత్సరాల క్రితమే విడాకుల కోసం యత్నించినా, తాము ఇచ్చిన కట్నం వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని వివరించారు. తన కొడుకు విషయం బయట చెబితే తమ పరువుపోతుంది కాబట్టి, బెదిరిస్తున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని అందుకే నిరసన చేస్తున్నట్లుగా బాధితులు వాపోయారు.
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు