News
News
X

టీడీపీని ఇరుకున పెట్టేందుకు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కొడాలి నాని- ఎన్టీఆర్‌ మృతిపై విచారణకు డిమాండ్

వివేకానందారెడ్డి మర్డర్ జరిగిందనే విషయం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డికి,భారతికి ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎల్లో మీడియా కావాలని తప్పుదారి పట్టిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఎన్నికల వార్ మరో మలుపు తిరిగే ఛాన్స్ ఉంది. ఇన్నాళ్లూ వెన్నుపాటు దారని చంద్రబాబు విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడు మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఏ తీరానికి వెళ్తుందో అన్న డిస్కషన్ స్టార్ట్‌ అయింది. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ చేస్తున్న విమర్శలపై స్పందించిన కొడాలి నాని ఇప్పుడు  ఎన్టీఆర్ మృతిపై విచారణకు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విరుచుకుపడ్డారు. నందమూరి తారకరామారావును మృతిపై మిస్టరీ వీడాలని డిమాండ్ చేశారు. తారాక రామారావు రాష్ట్ర సంపద అని, ఆయన ఎలా చనిపోయారో అందరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 

ఎన్టీఆర్ డెత్ మిస్టరీపై కామెంట్స్ చేసిన కొడాలి నాని... ప్రధాని మోదీ, కేంద్రహోమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తానని చెప్పారు. ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్లు, హార్ట్ ఎటాక్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. వీటన్నింటిపైనా కూడా విచారణ చేయాల్సిందేనని కేంద్రంతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కోరాతనని నాని చెప్పారు. 

వివేకా మర్డర్ కేసులో చార్జీషీట్ ఎందుకు వేయలేదు?

వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు హంతకులను పట్టుకోలేదని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుతో చంద్రబాబు,లోకేష్,  అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ,  కడప జిల్లా ఎస్పీతోపాటు టీడీపీ నేతల ఫోన్ కాల్స్ పైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వివేకా మర్డర్ కి ముందు ఆ తర్వాత వీళ్లంతా ఏమేం మాట్లాడుకున్నారో కూడా ఎంక్వైరీ చేయాలన్నారు.  

జగన్ తో మాట్లాడాలంటే వాళ్లకే ఫోన్ చేస్తాం!

వివేకానందారెడ్డి మర్డర్ జరిగిందనే విషయం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డికి,భారతికి ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎల్లో మీడియా కావాలని తప్పుదారి పట్టిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా జగన్ తో మాట్లాడాలంటే ఇంటి దగ్గరుంటే నవీన్ కి,  ఆఫీసులో కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేస్తారని చెప్పారు. ఫోన్ చేసి మాట్లాడినా కూడా అందరిని ఇందులోకి లాగేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు. 

చంద్రాబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఏమైపోయాడో కూడా ప్రజలకు నారా లోకేష్ చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. శాసనసభ్యుడిగా పనిచేసిన నీ సొంత బాబాయ్ రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నాడు, ఏం చేయారని నిలదీశారు.

Published at : 04 Feb 2023 04:30 PM (IST) Tags: YSRCP TDP Kodali Nani Chandra Babu NTR . Lokesh VIvek Murder Case

సంబంధిత కథనాలు

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్-ఒక్క ఓటు కూడా పోకుండా ప్లాన్!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ ఫోకస్-ఒక్క ఓటు కూడా పోకుండా ప్లాన్!

Roja Challenge: జగన్ ను ఓడించేటోడు పుట్టలేదు - చంద్రబాబు, బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి - మంత్రి రోజా ఛాలెంజ్

Roja Challenge: జగన్ ను ఓడించేటోడు పుట్టలేదు - చంద్రబాబు, బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి - మంత్రి రోజా ఛాలెంజ్

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !