(Source: ECI/ABP News/ABP Majha)
TDP Stage Collapse: కుప్పకూలిన టీడీపీ స్టేజ్, వేదికపై సీనియర్ నేతలు - పలువురికి గాయాలు
వేదిక ఈదురుగాలుల తాకిడికి కుప్పకూలినట్లుగా చెబుతున్నారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తుండగా వేదిక అనూహ్యంగా కుప్పకూలింది.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో నిర్వహించిన ఓ వేదిక కుప్పకూలింది. టీడీపీ కార్యక్రమం కోసం ఆ వేదిక నిర్మించగా, అది కూలిన సమయంలో వేదికపై పలువురు నేతలు ఉన్నారు. వేదిక ఈదురుగాలుల తాకిడికి కుప్పకూలినట్లుగా చెబుతున్నారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తుండగా వేదిక అనూహ్యంగా కుప్పకూలింది. చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత, చినరాజప్ప తదితరులు స్టేజిపై నుంచి కిందపడ్డారు.
మాజీ ఎంపీ మాగంటి బాబు కాలుకు తీవ్ర గాయాలు, నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మరో పది మంది కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన నూజివీడులో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు.
నూజివీడు టీడీపీ కార్యక్రమంలో కూలిన స్టేజ్ #TDP #Nuziveedu #Stage #TeluguNews pic.twitter.com/hVQ9lF8KUT
— ABP Desam (@ABPDesam) June 23, 2023