News
News
X

VV Vinayak: కొడాలి నాని వల్లే ఇలా, ఆయనతో సినిమాకు రెడీ - గుడివాడలో వివి వినాయక్

కొడాలి నాని గురించి మాట్లాడుతూ.. ఆయన వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని వివి వినాయక్ గుర్తు చేసుకున్నారు.

FOLLOW US: 
Share:

సినీ దర్శకుడు వీవీ వినాయక్ గుడివాడలో సందడి చేశారు. క్రిష్ణా జిల్లాలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత కొడాలి నాని సొంత నియోజకవర్గం అయిన గుడివాడలో నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు జరిగాయి. ఈ ప్రదర్శనలకు చిత్ర దర్శకుడు వివి వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక్‌కు మాజీ మంత్రి కొడాలి నాని స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు వీవీ వినాయక్‌ చెప్పారు. 

ఈ మేరకు వివి వినాయక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. ప్రజలు అందరూ కళకళలాడుతున్నారని, చూడ్డానికి చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి సంక్రాంతిని అందరూ ఇలాగే జరుపుకోవాలని ఆకాంక్షించారు. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు ప్రదర్శనలను తాను తొలిసారి చూస్తున్నానని అన్నారు. 

కొడాలి నాని గురించి మాట్లాడుతూ.. ఆయన వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. కొడాలి నాని తనకెంతో ఇష్టమైన వ్యక్తి అని అన్నారు. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఆయన నిర్మాతగా సినిమా చేసేందుకు తాను రెడీ అని అన్నారు. ఈ ఏడాది మార్చిలోనే తాను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుందని వినాయక్ అన్నారు. హిందీ సినిమా విడుదల అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తానని అన్నారు. ప్రస్తుతం వీవీ వినాయక్ తెలుగులో వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు.

ముగ్గురి కాంబినేషన్‌లో ‘సాంబ’

కొడాలి నాని నిర్మాతగా వీవీ వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘సాంబ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2004 లో ఈ సినిమా విడుదల అయింది. అంతకుముందు నుంచి వీరి మధ్య స్నేహం ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వీవీ వినాయక్ కాంబినేషన్‌లో సినిమా ఏదైనా రావచ్చా అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని వీవీ వినాయక్ అన్నారు. ఒకవేళ అవకాశం వచ్చినా రావచ్చు అందులో ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు, తొలి నుంచి జూనియర్ ఎన్టీఆర్‌తో, నందమూరి హరిక్రిష్ణతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీ పెట్టి తనను ఆహ్వానిస్తే కచ్చితంగా తాను ఆయన వెంట నడుస్తానని కొడాలి నాని గతంలో చెప్పారు.

Published at : 14 Jan 2023 06:54 PM (IST) Tags: Junior NTR Kodali Nani Gudivada News Director VV Vinayak

సంబంధిత కథనాలు

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

సెలవుపై వెళ్లిన దుర్గగుడి ఈవో - పోస్టింగ్ కోసం వైసీపీ నేతల మధ్య వార్ !

సెలవుపై వెళ్లిన దుర్గగుడి ఈవో - పోస్టింగ్ కోసం వైసీపీ నేతల మధ్య వార్ !

NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?

NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?

టీడీపీని ఇరుకున పెట్టేందుకు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కొడాలి నాని- ఎన్టీఆర్‌ మృతిపై విచారణకు డిమాండ్

టీడీపీని ఇరుకున పెట్టేందుకు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కొడాలి నాని- ఎన్టీఆర్‌ మృతిపై విచారణకు డిమాండ్

Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?

Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?

టాప్ స్టోరీస్

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్