By: ABP Desam | Updated at : 27 Sep 2023 10:50 AM (IST)
Edited By: jyothi
అంతర్జాతీయ వేదికపై మన విద్యార్థులను చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది: సీఎం జగన్ ( Image Source : Gita Gopinath Twitter )
CM Jagan: ఐఎంఎఫ్ కు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను స్వాగతించడం చాలా ఆనందంగా ఉందని ఐఎంఎఫ్ అధికారి గీతాగోపినాథ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. యూఎన్ పర్యటనలో భాగంగా ఏపీ విద్యార్థులు ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినందుకు తాను సంతోషిస్తున్నట్లు వెల్లడించారు.
It was really nice to welcome the students of Andhra Pradesh to the IMF. I am glad they made a stop at IMF headquarters as part of their UN and US tour. @AndhraPradeshCM pic.twitter.com/k2IPOz3l2R
— Gita Gopinath (@GitaGopinath) September 27, 2023
దీనిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తమ పిల్లలను కలుసుకున్నందుకు, వారిని ఇంత ఆప్యాయంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకంగా పని చేస్తుందని తాను నమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకు ఏపీ విద్యార్థులే నిదర్శనం అని అన్నారు. అంతర్జాతీయ వేదికపై ఆత్మ విశ్వాసంతో ప్రాతినిథ్యం వహిస్తున్న తమ పిల్లలను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందని వెల్లడించారు.
Thank you for meeting our children and receiving them with such warmth @GitaGopinath garu, their bright smiles say it all!
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2023
I truly believe that education is the biggest catalyst in not just transforming individual lives but in transforming entire communities. Our children are… https://t.co/WKek9sMdh9
ఎస్డీజీ యాక్షన్ వీకెండ్ సదస్సులో విద్యార్థులు
ఐక్యరాజ్య సమితి వేదికగా న్యూయార్క్‌లో జరిగిన ఎస్డీజీ యాక్షన్ వీకెండ్ సదస్సులో.. ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 16వ తేదీ రోజు జనరల్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో ఏపీ విద్యార్థులు తమ గళం వినిపించారు. తొలిరోజు దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, షేక్ అమ్మాజాన్, వంజివాకు యోగేశ్వర్ మాట్లాడారు. 2030 నాటికి భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు సుస్థిరాభివృద్ధిలో యువత ప్రాధాన్యం చాలా అవసరం అని అన్నారు. అభివృద్ధికి యువత టార్చ్ బేరర్ గా బాధ్యత తీసుకోవడం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. అయితే యూఎన్ఓ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులను లీడర్లను చేసేలా విద్యా వ్యవస్థలో సీఎం జగన్ అనేక సంస్కరణలు చేపట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన తీసుకొస్తున్న అద్భుతమైన పథకాల వల్లే సర్కారు బడిలో చదివే పిల్లలకు యూఎన్ఓ సదస్సులో స్థానం దక్కిందని అంటున్నారు.
ఐక్యరాజ్యసమితి వేదికగా న్యూయార్క్‌లో జరుగుతున్న SDG యాక్షన్ వీకెండ్ సదస్సులో పాల్గొన్న ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. UNO సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. మన రాష్ట్ర విద్యార్థులను లీడర్లను చేసేలా… pic.twitter.com/ej33tUnNn6
— YSR Congress Party (@YSRCParty) September 17, 2023
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
AP Tenth: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
Breaking News Live Telugu Updates: కేసీఆర్ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
/body>