అన్వేషించండి

APSRTC: ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. వినూత్న ప్రయోగానికి ఆర్టీసీ నిర్ణయం

APSRTC: టిక్కెట్ బుక్ చేసుకుంటే ఆర్టీసీ బస్సు కూడా ఇంటి వద్దకే వస్తుంది. ఈ వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ సిటీలో శ్రీకారం చుట్టనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైకోర్టు బస్సు రూట్ మార్పు; అదనపు ట్రిప్ సోమవారంనుండి అమలు.

APSRTC: యాప్‌లో బుక్ చేసుకుంటే.. ఆటో, క్యాబ్, బైక్ మన ఇంటికే వస్తాయి. అయితే ఇకపై ఆర్టీసీ బుస్ కూడా మన ఇంటి వద్దకే వస్తుంది. ఇలాంటి వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టునుంది. టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకుంటే ప్రయాణికుల ఇంటి వద్దకే బస్సును పంపించేలా ఆలోచన చేస్తు్న్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా ఆర్టీసీ అధికారిణి వి. నీలిమ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ సదుపాయం మాత్రం విజయవాడ సిటీ ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. 

ఇంటి వద్దకే బస్సు 

ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు కార్యక్రమాన్ని విజయవాడ-హైదరాబాద్‌ రూటులో ప్రయోగాత్మకంగా టెస్టు చేస్తున్నట్లు నీలిమ తెలిపారు. ప్రయాణికులు ఆరుగురు అంతకన్నా ఎక్కువ మంది ఉంటే.. ఇంటర్నెట్, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్‌ బుక్ చేసుకున్న వారికి ఈ అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటి వద్దే బస్సు ఎక్కాలనుకున్న వారు ఎక్కాల్సిన ప్రదేశం నుంచి బస్టాండ్‌కు ఎంత దూరం ఉంటుందో అంత టికెట్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సదుపాయం కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య  ప్రయాణికులు ఎక్కాల్సిన బస్సు సమయానికి కనీసం నాలుగు గంటల ముందు 73828 25450, 99592 25450 మొబైల్ నెంబర్లను సంప్రదించి వివరాలు అందించాలని నీలిమ తెలిపారు.   

Also read: విజయవాడ- అమరావతి మధ్య రూ.1,000 కోట్లతో సిగ్నేచర్‌ బ్రిడ్జి.. ఆరు లేన్లతో ప్రతిపాదన

బల్క్ టికెట్లకు ఛాన్స్ 

సూపర్‌ లగ్జరీ, ఏసీ, స్లీపర్‌ వంటి బస్సుల్లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాక, నిర్ణీత సమయం కంటే ముందుగా బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉండేది. లగేజీతో పాటు సకాలంలో బస్టాండ్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. దీనిని గమనించిన ఆర్టీసీ బల్క్‌గా టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికుల కోసం ఇంటి వద్దే పికప్‌ చేసుకునే సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ బస్సులను ప్రయాణికుల ఇంటి వద్దకు పంపి పికప్ చేసుకునేలా ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగర పరిధిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే బల్క్‌గా టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ముందుగా ఆ సమాచారాన్ని ఆర్టీసీ అధికారులకు తెలియజేయాలి.   

Also read: క్యాడర్ అంచనాలు ఆకాశంలో - స్థానిక ఎన్నికల్లో జనసేనకు లిట్మస్ టెస్ట్ !

హైకోర్టు బస్సు రూటు మార్పు

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఏపీ హైకోర్టుకు ప్రతి రోజు ఉదయం 9.10 నిమిషాలకు వెళ్లే బస్సు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, సీఆర్‌డీఏ మీదుగా హైకోర్టును చేరుకునేలా రూటు మార్పు చేశారు. ఉదయం 9.25 నిమిషాలకు ఉండవల్లి సెంటర్‌ నుంచి వయా పెనుమాక, మందడం మీదుగా హైకోర్టుకు వెళ్లే విధంగా అదనపు ట్రిప్‌ను సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.  

Also read: వైఎస్సార్‌సీపీలో సాయిరెడ్డి టైమ్ బాంబ్ - సజ్జలపై పార్టీ క్యాడర్‌లో, జగన్‌లో అనుమానం పెంచే వ్యూహంలో సక్సెస్ అయ్యారా?

Frequently Asked Questions

హైకోర్టు బస్సు రూట్‌లో మార్పులు ఏమిటి?

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి ఉదయం 9.10కి బయలుదేరే బస్సు ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు, సీఆర్డీఏ మీదుగా వెళ్తుంది. ఉండవల్లి సెంటర్ నుండి 9.25కి అదనపు ట్రిప్ కూడా ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
YS Sharmila Daughters Wedding: నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మారింది, రిసెప్షన్ వివరాలు
నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మారింది, రిసెప్షన్ వివరాలు
CM Chandrababu: ఏపీలో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, అధికారులకు కీలక ఆదేశాలు
ఏపీలో రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, అధికారులకు కీలక ఆదేశాలు
AP Urban Local Body Elections: 87 డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాల్లో 84 చోట్ల కూటమి విజయం.. కొన్నిచోట్ల అనూహ్య ఘటనలు
87 డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాల్లో 84 చోట్ల కూటమి విజయం.. కొన్నిచోట్ల అనూహ్య ఘటనలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget