News
News
X

తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్- బదిలీల ఫైల్‌పై సీఎం జగన్ సంతకం

ఈ అంతర్రాష్ట్ర బదిలీ ప్రక్రియలో ఏపీకి చెందిన 1338 మంది తెలంగాణ నుంచి వెళ్లనున్నారు. తెలంగాణకు చెందిన 1804 మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ బదిలీ కానున్నారు. 

FOLLOW US: 

ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ ఛైర్మన్‌ కె. వెంకటరామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి చెందిన ఉద్యోగులు, ఏపీ నుంచి తెలంగాణకు చెందిన ఉద్యోగులు బదిలీల కోసం చాలా రోజుల తర్వాత అంగీకారం లభించింది.

ఈ ఉద్యోగుల కోసం రెండు ప్రభుత్వాలు ఓ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఇలా పరస్పర అంగీకారంతో బదిలీలు కోరకునే వారి వివరాలు సేకరించాయి. వాళ్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం సమ్మతి తెలిపింది. 

ఈ అంతర్రాష్ట్ర బదిలీ ప్రక్రియలో ఏపీకి చెందిన 1338 మంది తెలంగాణ నుంచి వెళ్లనున్నారు. తెలంగాణకు చెందిన 1804 మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ బదిలీ కానున్నారు. 

ఈ బదిలీల కోసం ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి అటు ఏపీలో ఉన్న ఉద్యోగులు తెలంగాణకు రావాలని, తెలంగాణలో ఉన్న ఉద్యోగులు ఏపీకి వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇన్నాళ్లకు వాళ్ల ప్రయత్నాలు ఫలించాయి. సాధారణ పరిపాలన విభాగం పంపిన ప్రతిపాదన ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. 

ఇప్పుడు ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుంది. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం ఓకే చెబితే ఉద్యోగుల బదిలీలు ప్రారంభంకానున్నాయి. ఉపాధ్యాయుల బదిలీలకు ఎనిమిదేళ్ల సర్వీస్‌ పరిగణలోకి తీసుకోనున్నారు. 

Published at : 10 Sep 2022 07:54 AM (IST) Tags: ANDHRA PRADESH AP EMPLOYEES Teachers transfers CM Jagan Telangana Employees

సంబంధిత కథనాలు

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

AP SC Welfare: ఏపీలో ఎస్సీల సంక్షేమానికి కేంద్రం రూ.2,837 కోట్లు - శాఖల వారీగా కేటాయింపుల వివరాలు

AP SC Welfare: ఏపీలో ఎస్సీల సంక్షేమానికి కేంద్రం రూ.2,837 కోట్లు - శాఖల వారీగా కేటాయింపుల వివరాలు

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

కళ్యాణమస్తు పథకంలో టెన్త్‌ తప్పనిసరి రూల్‌ అందుకే పెట్టాం: సీఎం జగన్

కళ్యాణమస్తు పథకంలో టెన్త్‌ తప్పనిసరి రూల్‌ అందుకే పెట్టాం: సీఎం జగన్

Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!

Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి