Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Andhra Pradesh: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రాావాల్సి ఉంది.
ACB Raids In Jogi Ramesh House: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇబ్రహిం పట్నంలో ఆయన నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. 15 మంది ఏసీబీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సీఐడీ జప్తులో ఉన్న భూములను ఈయన కొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రగా వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకొని ఓవైపు దాడులు చేస్తున్న ప్రభుత్వం... ఇప్పుడు కేసులతో వేధిస్తోందని విమర్శిస్తోంది.
అందులో భాగంగానే జోగిరమేష్‌పై కేసులు పెట్టి ఇలా దాడులు చేస్తోందని ఆరోపించారు. అసలు సోదాలు ఎందుకు చేస్తున్నారో చెప్పలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారని అంటున్నారు. జోగి రమేష్ ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నాయి.