అన్వేషించండి

Ysrcp: నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను చంపించామా? చంద్రబాబుపై శ్రీకాంత్ హాట్ కామెంట్స్

వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకంత భయమని ప్రభుత్వ చీఫ్ విప్ గండి కోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

పేదలకు మంచి చేయాలని నిరంతరం ఆలోచన చేసే నేత సీఎం జగన్‌(CM Jagan) ఆలోచిస్తుంటే కృష్ణా నది కరకట్ట పక్కన, అక్రమంగా నిర్మించిన ఒక భవనంలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) ఇప్పుడు అదే భవనం నుంచి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం, నిందించడం అదే వారి ఎజెండా అని విమర్శించారు. ఇవాళ వివేకానంద హత్య మీద అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తుంటే, అది పూర్తి కాకముందే రోజుకొక కథనం, లీక్‌లు చేస్తూ ప్రభుత్వంపై నిందలు వేయడం, బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఆ దర్యాప్తుకు సహకరిస్తోందన్నారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ(TDP) రాష్ట్రంలోకి అసలు సీబీఐని అడుగు పెట్టనివ్వబోమని అన్నారు. కానీ ఇవాళ అదే సంస్థను పొగుడుతుందని విమర్శించారు. 

సీబీఐ(CBI) అధికారి రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేయించి, కేసు నమోదు చేయించారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు ఆరోపించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ కేసుతో ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. గత నెల 27న గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి సీబీఐ అధికారి రాంసింగ్‌పై ఫిర్యాదు చేశారు. అయినా కేసు ఫైల్‌ చేయకపోవడంతో ఈనెల 15న మరో ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్య తీసుకోకపోతే, కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు రాంసింగ్‌పై కేసు నమోదు చేస్తే, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇది కోర్టు ఉల్లంఘన కాదా? కోర్టును అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు. 

కేబినేట్ మంత్రి హఠాన్మరణం చెందితే, ఆయన మృతిపై అన్యాయంగా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. 'వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీ మాదిరిగా నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను చంపించామా? పింగళి దశరథరామ్‌ అనే ఒక విలేకరిని హత్య చేశారు. ఒక ప్రజా నాయకుడిని బతికుండగానే హింసించి చంపారు. మీరు చేసినవి క్రిమినల్‌ ఆలోచనలు. కానీ మీరు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. నిజానికి చనిపోయింది మా నాయకుడి చిన్నాన్న. ఆయన హత్య కేసులో నిందితులను గుర్తించాలని కోరుకుంటున్నాం. ఒక కన్ను ఇంకో కన్నుకు హాని చేయాలని చూడదని సీఎం చాలాసార్లు చెప్పారు. ఆయన మరణం వల్ల నష్టం జరిగింది మాకే. అయినా మీరు ఎందుకు మాపై బురద చల్లుతున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నా ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది.' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 

'వివేకానందరెడ్డి మరణం గురించి ఆయన బావమరిది అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. అవన్నీ రికార్డులో ఉన్నాయి. అయినా మాపై ఎందుకు బురద చల్లుతున్నారు. మేము వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నాం. అంతేకానీ కేసును తప్పుదోవ పట్టించాలని అనుకోవడం లేదు. కానీ మీరు అనుమానాలకు తావిస్తూ ఏదేదో జరుగుతుందని రాస్తున్నారు. ఎందుకు ఆరోజు లేఖ సాయంత్రం వరకు బయటకు రాలేదు? ఆరోజు కేసును తప్పుదోవ పట్టించాలని చూసిందెవ్వరు?. దస్తగిరి స్టేట్‌మెంట్‌ అధికారికంగా బయటకు రాలేదు. కానీ దాన్ని మీరు ఎలా రాశారు. ఎలా మాట్లాడారు. ఈ కేసు గురించి మీకు ఎందుకంత భయం? మాపై ఎందుకు బురద చల్లుతున్నారు. మీకు అన్నీ దుర్మార్గమైన ఆలోచనలు వస్తున్నాయి. సీబీఐ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుంది? ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని మీరు కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. బయట అలా మాట్లాడించి, లోపల ఏం చేస్తారో అన్న భయం మాకు కలుగుతుంది.' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget