By: ABP Desam | Updated at : 30 Dec 2022 09:15 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
దేవినేని అవినాష్
Devineni Avinash : టీడీపీ నేత బోండా ఉమాపై వైసీపీ నేత దేవినేని అవినాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బోండా ఉమ లాంటి వ్యక్తిని చంద్రబాబు తప్ప ఇంకెవరూ ప్రోత్సహించరన్నారు. బోండా ఉమా ఒక చిల్లర వ్యక్తి, బజారు మనిషి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెజవాడకు గంజాయి అలవాటు చేసిన వ్యక్తి బోండా ఉమా అంటూ విమర్శలు చేసారు. బైక్, కారు రేసులు, రేవ్ పార్టీ కల్చర్ ను విజయవాడకు తెచ్చింది కూడా బోండా ఉమా అని దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. తిరుపతిలో బోండా ఉమా సారా వ్యాపారం చేసేవారన్నారు. కోగంటి సత్యం, ఐలాపురం వెంకయ్య దగ్గర డ్రైవర్‌గా పని చేసి వాళ్లను మోసం చేసిన వ్యక్తి బోండా ఉమా, టీడీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలు చేశారని ఆరోపించారు. ఆ అవినీతి బయటపడకుండా చంద్రబాబు కాళ్లు పట్టుకొని బోండా ఉమా బయటపడ్డారన్నారు. మంత్రి పదవి కోసం చంద్రబాబును బోండా బ్లాక్ మెయిల్ చేస్తే, భూ కబ్జాలపై చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని దేవినేని అవినాష్ తెలిపారు.
దేవినేని నెహ్రూపై నోరుజారితే తాటతీస్తాం
గతంలో మహిళలు రోడ్డు మీద చెప్పులతో కొట్టిన విషయం బోండా ఉమా గుర్తుంచుకోవాలని అవినాష్ ఎద్దేవా చేశారు. మరోసారి దేవినేని నెహ్రూపై నోరుజారి మాట్లాడితే అదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. దేవినేని నెహ్రూ చనిపోయి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై దేవినేని నెహ్రూ పేరు ప్రస్తావిస్తే లీగల్ గా ముందుకు వెళ్తామన్నారు. చంద్రబాబు కాపుల గొంతు కోసారని అప్పట్లో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను దేవినేని అవినాష్ గుర్తుచేశారు. ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుంటున్నానని, సీఎం జగన్ నుంచి ప్రోత్సాహం ఉందనే తనను టార్గెట్ చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం గురించి కానీ, తమ గురించి కానీ మాట్లాడితే తాట తీస్తామని దేవినేని అవినాశ్ హెచ్చరించారు.
బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేత బోండా ఉమాపై దేవినేని నెహ్రూ, కొడాలి నానిపై సంచలన ఆరోపణలు చేశారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ పక్కనే ఉన్నారన్నాు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ వద్దే కొడాలి నాని ఉన్నారని బోండా ఉమా ఆరోపించారు. రంగా వర్థంతిని ఎవరు చేయాలో నిర్ణయించడానికి కొడాలి నాని ఎవరంటూ ఉమా ప్రశ్నించారు. బెజవాడలో దేవినేని అవినాష్ దందాలు చేస్తున్నారని, ఈ దందాలను ప్రోత్సహిస్తుంది ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. దేవినేని అవినాష్ విజయవాడలో వ్యభిచార గృహాలు, మసాజ్ పార్లర్లు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ పాదయాత్రతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. లోకేశ్ యువగళంతో ఏపీ ముఖచిత్రం మారపోతుందని తెలిపారు. కందుకూరు ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని బోండా ఉమా ఆరోపించారు. పోలీసుల వైఫల్యాన్ని టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో డీజీపీ విఫలయ్యారన్నారు. చంద్రబాబు సభలకు లక్షల మంది ప్రజలు వస్తున్నారని తెలిపారు.
K Viswanath Death: విశ్వనాథ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొని బాల్య స్నేహితులు కన్నీరు
దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్!
AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంతనాలు!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!