Minister Roja : ఆ ఫొటో నా జీవితాన్నే మార్చేసింది - మంత్రి రోజా
Minister Roja : విజయవాడలో ఫొటోగ్రఫీ కార్నివాల్, ఫొటోగ్రఫీ ఎక్స్ పో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా సందడి చేశారు. మూడు వేల మంది ఫొటో గ్రాఫర్లు మంత్రిని ఒక్క క్లిక్ లో ఫొటోలు తీశారు.
Minister Roja : ఒక్క ఫొటో తన జీవితాన్నే మార్చేసిందని మంత్రి రోజా అన్నారు. తెలిసి తెలియకుండా ఒక ఫొటో గ్రాఫర్ తీసిన ఒక చిత్రంతో తనను చూడకుండా సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారని మంత్రి రోజా ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ప్రేమ తపస్సు తన మొదటి చిత్రం జ్ఞాపకాల గురించి ఆమె గుర్తుచేసుకున్నారు. విజయవాడలో ఫోటోగ్రఫీ కార్నివాల్, ఫోటోగ్రఫీ ఎక్స్ పోలో సందడి చేశారు ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఒక ఫొటోగ్రాఫ్ తో మొదలైన నా జీవితం నన్ను అంచెలంచెల ఎదిగేలా చేసిందని చెప్పారు. కళ్లకు కట్టినట్లు సుజనాత్మకతంలో ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్స్ కీలకపాత్ర వహిస్తారన్నారు.
3 వేల మంది ఫొటో గ్రాపర్స్ క్లిక్
ఒకే క్లిక్ తో 3 వేల మంది ఫొటోగ్రాఫర్స్ ఫొటో తీయటం గొప్ప అనుభూతిని అని మంత్రి రోజా చెప్పారు. ఒకే వేదిక పైకి ఫొటోగ్రాఫర్లను తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కెమెరా అంటే నేటి సమాజంలో మూడో కన్నుగా మారిందని ఆమె అన్నారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రళయం వస్తుందని, కెమెరా మెన్ మూడో కన్నుతో ప్రకృతి పరవశిస్తుందని రోజా కొనియాడారు. కెమెరా అనేది లేకపోతే చరిత్ర ఉండదని, ఫ్యూచర్ కూడా ఉండదన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో 3 వేల మంది ఫొటో గ్రాఫర్లు తనను ఫొటోలు తీయటం ఆనందంగా ఉందని రోజా వ్యాఖ్యానించారు.
విజయవాడలో ఫోటో గ్రాఫర్స్ ''ఒన్ క్లిక్ ఆన్ సేమ్ టైం - వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'' కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ClickonSameTime #WonderBookofRecords pic.twitter.com/jOZKKQqkMt
— Roja Selvamani (@RojaSelvamaniRK) July 30, 2022
కెమెరాలతో రోజా సందడి
లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఫొటో ట్రాఫర్లు మందుకు సాగాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరిగే ఫొటో ఎక్స్ పోలో తాను కూడా భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందని తెలిపారు. ఫొటో ఎక్స్ పోలో అధునాతన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన కెమెరాలతో రోజా సందడి చేశారు. ఆమె కూడా స్వయంగా ఫొటోలు తీశారు. టెక్నాలజీని వినియోగించుకోవటం ద్వారా రాబోయే రోజుల్లో ఫొటోగ్రఫీని మరింతగా అభివృద్ధి చేయాలన్నారు.
Also Read : AP Bar Policy : ఏపీలో మద్యం బార్ల వేలానికి భారీ స్పందన, తిరుపతిలో రూ1.59 కోట్లు పలికిన బార్
Also Read : Gudivada Amarnath : మాది డీబీటీ టీడీపీది డీపీటీ - చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు !