By: ABP Desam | Updated at : 30 Jul 2022 04:02 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీలో బార్ల లైసెన్స్ లకు భారీ స్పందన
AP Bar Policy : ఏపీలో మద్యం సిరులు కురిపిస్తుంది. మద్యం బార్ల వేలానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్ వేలం ధర రూ. 1.59 కోట్లు పలికింది. మద్యం బార్ వేలంలో కడప, తిరుపతి అధికార పార్టీ నేతలు పోటాపోటీగా పాల్గొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర బార్లకు శనివారం ఈ ఆక్షన్ నిర్వహించారు. చాలా చోట్ల మద్యం బార్ల వేలం రూ. కోటి పైనే పలికాయి. అనంతపురంలో కూడా భారీగా పోటీ ఉంది. అనేక నగరాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు తమ అనుచరులను రంగంలోకి దించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తిరుపతి బార్ల వేలం దగ్గర వైసీపీ నేతల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు.
బార్ లైసెన్స్ లు ఆన్ లైన్ బిడ్డింగ్
ఏపీలో బార్ లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడంతో వ్యాపారులు పోటీపడ్డారు. మొదటిసారి ఆన్‌లైన్ విధానంలో బిడ్డింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా పోటీనెలకొంది. లైసెన్స్ ఫీజులు, మద్యం సరఫరా రూపంలో రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రుపాయలు రానున్నాయి. అదే సమయంలో తొలిసారి ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వ హిస్తుండగా లైసెన్సులు జారీలో పారదర్శకతకు అవకాశం కలిగిందని వ్యాపారులు అంటున్నారు.
బార్ లైసెన్స్ లకు భారీ స్పందన
ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన బార్ లైసెన్స్ విధానానికి భారీ స్పందన వస్తుంది. ఈ వేలంలో బార్లు దక్కితే 2025 వరకూ లైసెన్స్ అమల్లో ఉంటుంది. మద్యం అమ్మకాలు పెరుగుతున్న క్రమంలో బార్లపై పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఫీజుల రూపంలోనే ఖజానాకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. విశాఖలో మద్యం బార్ల పోటీ మరింత ఎక్కువగా ఉంది. బార్ లైసెన్స్ దక్కించుకునేందుకు భారీ స్పందన వచ్చింది. 2017-22 బార్ పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజు రూ.44 లక్షలు ఉంది. బిడ్డింగ్ కూడా ఎక్సైజ్ అధికారుల ప్రమేయంతో జరిగేది. అయితే బార్ పాలసీలో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఎక్కడి నుంచైనా బిడ్డింగ్ వేయవచ్చు. లైసెన్స్ ఫీజులను పెంచడమే కాకుండా నాన్ రిఫండబుల్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. పెద్ద నగరాల్లో రూ.60 లక్షలు, జనాభా 5 లక్షలు దాటిన మున్సిపాలిటీల్లో రూ.35 లక్షలు, మిగిలిన టౌన్లలో రూ.15 లక్షలుగా ఫీజులు నిర్ణయించింది ప్రభుత్వం.
విశాఖలో టీడీపీ ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ విశాఖలో టీడీపీ మహిళల నిరసన చేపట్టారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ పాదయాత్ర చేశారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంగలపూడి అనిత మాట్లాడుతూ.. జగన్ మద్యపాన నిషేధం అంటూ మద్యంధ్రప్రదేశ్ గా మర్చి మహిళల్ని మోసం చేశారన్నారు. జగన్ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి మహిళల పుస్తెలు తెంపుతున్నారన్నారు. మద్యం ఏరులై పారిస్తున్న జగన్ కి ఆ పాపం ఊరికే పోదన్నారు. మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వస్తానన్నారని, ఇప్పుడు సీఎం జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నించారు. మంత్రులు రోజా, విడదల రజనిలు దీనికి ఏం సమాధానం చెపుతారన్నారు.
Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి
Tea Shop Attack : సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వలేదని టీ షాపు యజమానిపై దాడి
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
CJI : సీజేఐ చేతుల మీదుగా ఈ నెల 20న కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం
Nellore Police : నెల్లూరు పోలీసులపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశాలు
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!