అన్వేషించండి

AP Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల ఖాళీలు... త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించిన మంత్రి పెద్ది రెడ్డి

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న 14,493 ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను వచ్చే జూన్ నాటికి ఖరారు చేస్తామన్నారు.

ఈ ఏడాది జూన్‌ నెలాఖరులోపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలో వాలంటీర్, సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలో భర్తీచేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఈ ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుపై ఆయా శాఖల వారీగా సర్టిఫికెట్లు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ను ఆదేశించారు.

త్వరలో పోస్టుల భర్తీ

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ (ఏపీ సేవా పోర్టల్‌ 2.0)ను సీఎం జగన్‌ ప్రారభించారని గుర్తుచేశారు. దీంతో ప్రజలు తమ సేవలను ఏ సచివాలయం నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్, సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో 11,162, పట్టణాల్లో 3,842 మొత్తం 15,004 సచివాలయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో 11, వార్డు సచివాలయాల్లో 10 పనులకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించారు. అయితే సచివాలయాల్లో ఉన్న 14,493 ఖాళీలను త్వరలో భర్తీచేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 3.50 కోట్ల సేవలు అందించామన్నారు. 

ఏపీ సేవా పోర్టల్

రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన చేరువైందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 'ఏపీ సేవ పోర్టల్'ని తీసుకొచ్చింది. ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే అది ఎప్పుడు, ఏ అధికారి వద్ద ఉందో దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో తెలియజేస్తుంది. ఈ సేవకు సంబంధించిన ‘ఏపీ సేవ పోర్టల్‌’ని సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. సీఎం జగన్ మాట్లాడుతూ... ఏపీ సేవ పేరుతో సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీ తనం పెంచేందుకు ఈ పోర్టల్ మరింత ఉపయోగపడుతోందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Embed widget