News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

VijaySai Reddy BC : జనాభా ప్రాదిపదికన రిజర్వేషన్లు అడగాలి - వైఎస్ఆర్‌సీపీ బీసీ నేతల సమావేశంలో విజయసాయిరెడ్డి సలహా!

బీసీలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అడగాలని విజయసాయిరెడ్డి సూచించారు. తాడేపల్లిలో వైఎస్ఆర్‌సీపీ బీసీ నేతలతో సమావేశం అయ్యారు.

FOLLOW US: 
Share:

VijaySai Reddy BC :  బీసీ సామాజికవర్గాలకు చెందిన వారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అడగాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీలోని వివిధ బీసీ వర్గాలకు చెందిన నేతలతో ఆయన తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కొన్ని  ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఎస్సి  ఎస్టీ  లకు  రిజర్వేషన్లను  రాజ్యాంగం ఇచ్చిందన్నారు.  జనాభా  ప్రాతిపదికన  బిసి లు   రిజర్వేషన్లు  అడగాలని.. కొన్ని  వర్గాలను ఎస్సి  ఎస్టీ  లో  కలపాలని  కోరితే  సాధ్యం కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.  ఏ  ఒక్క  సామాజిక  వర్గానికి అన్యాయం   జరగకుండా  రిజర్వేషన్లు  ఉండాలన్నారు. 

సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ముఖ్యమంత్రితో ఆదేశాలు ఐ ప్యాక్ సహకారంతో బీసీ నేతలతో సమావేశం అయ్యామన్నారు.  భవిష్యత్  లో  బీసీల  సమస్యలు  పరిష్కారం  పై  చర్చ జరిగిందన్నారు.  225  మంది  ప్రజా  ప్రతినిధులు  ఈ సమావేశానికి  హాజరయ్యారని.. తెలిపారు.  మరో  పది  రోజుల్లో  స్థానిక  బిసి ప్రజా  ప్రతినిధులు తో  మరో  సమావేశం  నిర్వహిస్తున్నామని..  26  జిల్లాలలో  కూడా  బిసి  ల సమస్యల  పరిష్కారం  కోసం  సమావేశాలు  ఉంటాయని ప్రకటించారు.  ప్రతి  పనిలో  బిసిల శ్రమ  కృషి  ఉన్నాయన్నారు. అందుకే   వైసీపీ  బిసి లకు  అత్యధిక  ప్రాధాన్యత  ఇస్తోందని గుర్తు చేశారు. సీఎం  అహర్నిశలు  బిసి ల  అభ్యున్నతికి  కృషి చేస్తున్నారన్నారు.  ప్రస్తుత సమవేశంలో 139 బీసీ సామాజిక వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని.... 225 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు.  

స్థానిక ఎన్నికల్లో గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. కానీ హైకోర్టు తీర్పు కారణంగా గత ఎన్నికల్లో కేవలం 24 శాతం వరకే నిర్ణయించి ఎన్నికలు జరిపారు . దీంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకే రిజర్వేషన్ల అంశంలో బీసీ నేతలతో ప్రస్తుతం సమావేశాలు నిర్వహిస్తున్నారని.. బీసీలు యాభై శాతం మందికిపైగా ఉన్నారని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అడగాలని సూచిస్తున్నారని భావిస్తున్నారు. ఈ అంశంపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించడంతో... ఈ అంశాన్ని రిజర్వేషన్ల ఉద్యమంగా మార్చే ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు. 

కాపు రిజర్వేషన్ల అంశం కూడా ఏపీలో అపరిష్కృతంగా ఉంది. కాపు రిజర్వేషన్లను జగన్ సీఎం  అయ్యాక తొలగించారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటా కింద పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల చట్టపరమైన లాంఛనాలు పూర్తయ్యాయి. సర్టిఫికెట్ల జారీనే మిగిలింది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లు సాద్యం కావని తొలగించారు. ఇలాంటి డిమాండ్‌ల కారణంగా ప్రస్తుతం విజయసాయిరెడ్డి సమావేశాలు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. 

Published at : 26 Oct 2022 04:06 PM (IST) Tags: YSRCP Vijayasai Reddy reservations for BCs Vijayasai Reddy on BCs

ఇవి కూడా చూడండి

Telangana Results Sunil Kanugolu : కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు - పీకేను మించిన స్ట్రాటజిస్ట్ అయినట్లేనా ?

Telangana Results Sunil Kanugolu : కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు - పీకేను మించిన స్ట్రాటజిస్ట్ అయినట్లేనా ?

KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Weather Latest Update: నేడు బంగాళాఖాతంలో తుపాను, అతి భారీ వర్ష సూచన: ఐఎండీ

Weather Latest Update: నేడు బంగాళాఖాతంలో తుపాను, అతి భారీ వర్ష సూచన: ఐఎండీ

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×