Vijaysai Reddy : ప్రధాని మోదీతో విజయసాయిరెడ్డి భేటీ - ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చ!
Vijayasai Reddy Meets Modi : ప్రధాని మోదీతో విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారు. ఏపీ అంశాలపై మాట్లాడానని సోషల్ మీడియాలో తెలిపారు.
Vijayasai Reddy Meets Modi : ప్రధాని నరేంద్రమోడీతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక అంశాలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానమంత్రిని కలుసుకోవడం గౌరవంగా విశేషంగా భావిస్తున్నానని ఈమేరకు భేటీ అనంతరం సోషల్ మీడియాలో తెలిపారు.
Today, I met the Hon’ble Prime Minister Shri @narendramodi Ji in his office in Parliament and highlighted several issues concerning Andhra Pradesh. As always, it was an honour and privilege to meet the Hon’ble PM. Looking forward to a fruitful collaboration between the Centre and…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 11, 2023
ఏపీ ప్రజల కోసం కేంద్రం సహకారం
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫలవంతమైన సహకారం ఆశిస్తున్నామని అన్నారు. కేంద్రం- రాష్ట్రంలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల మధ్య.. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించానన్నారు.
ప్రధానితో భేటీ కావడం గౌరవం
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. పార్ల మెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించానని.. ఎప్పటిలాగే, ప్రధానమంత్రిని కలవడం ఒక గౌరవం.. విశేషం అంటూ విజయసాయి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫలవంతమైన సహకారం కోసం ఎదురు చూస్తున్నామంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా, ఆర్థిక సహకారం, కేంద్రప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు చెబతున్నారు.
కశ్మీర్ అంశంలో నెహ్రూదే తప్పన్న విజయసాయిరెడ్డి
అంతకు ముందు రాజ్యసభలో కశ్మీర్ అంశంపై మాట్లాడిన విజయసాయిరెడ్డి.. నెహ్రూ వల్లనే సమస్య ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు అరుపులు, కేకలతో నిరసన తెలిపినా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.