News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vasireddy Padma : ఆ టీడీపీ నేతను అరెస్ట్ చేయండి - డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ !

టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేయాలని వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

Vasireddy Padma : మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత  బండారు సత్యనారాయణమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు.  రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.  బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్ లు పెట్టి మరీ.. బండబూతులు మాట్లాడుతున్నారని.. వీటిని ఎంత మాత్రం సహించరాదని పేర్కొన్నారు.  వెంటనే కేసు నమోదు చేసి.. తక్షణం అరెస్టు చేయాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు.

మంత్రి రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు, న్యాయవాదులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ. బండారు వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని.. అతని వ్యాఖ్యలపై అందరూ సీరియస్ గా స్పందించాలని కోరారు.

బండారు ఏమన్నారంటే ?

నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన అమర్యాద వ్యాఖ్యలను ఖండిస్తూ రెండు రోజుల కిందట  మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాపై ఘాటు విమర్శలు చేశారు.  ‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మనీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. రోజా... నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక సంప్రదాయమైన కుటుంబం గురించి నువ్వు మాట్లాడటమెంటి..? ఒక పనికిమాలిన, దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ రోజాకు సపోర్ట్ చేస్తున్నావు . మహిళలకు గౌరవమిచ్చే పార్టీ మాది. అందుకే నీ చరిత్ర బయట పెట్టడం లేదు. రోజా 24 గంటల్లోగా నందమూరి, నారా కుటుంబాలకు క్షమాపణ చెప్పకపోతే నీ చరిత్రను బయట పెడుతా’’ అని బండారు సత్యనారాయణమూర్తి  మండిపడ్డారు.                                                                 

ఇవాళ నీతి సూత్రాలు, ప‌తివ్ర‌త కామెంట్స్ చేస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ వ‌ద్ద నీ పూర్తి బండారం ఉంద‌న్నారు. రోజా గ‌తంలో బ్లూ ఫిల్ముల‌లో న‌టించింద‌ని, దానికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌న్నారు.  ఆనాడు మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన సంగతి మ‌రిచి పోయావా అని ప్ర‌శ్నించారు. ఎల‌క్ష‌న్స్ కోసం వ‌చ్చి ఎవ‌రి వ‌ద్ద ప‌డుకున్నావో, ఎన్ని లాడ్జీలు తిరిగావో త‌మకు తెలుస‌ని, అన్ని వివ‌రాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే. ఈ కామెంట్లు వైరల్‌గా మారడంతో..  మహిళా కమిషన్ స్పందించింది. 

Published at : 30 Sep 2023 03:32 PM (IST) Tags: AP News RK Roja Bandaru Satyanarayana Murthy

ఇవి కూడా చూడండి

YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ

YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

Anantapur Teacher Suicide: టీచర్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్, అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు

Anantapur Teacher Suicide: టీచర్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్, అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు

Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా! అసలు విషయం చెప్పిన వైసీపీ నేత

Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా! అసలు విషయం చెప్పిన వైసీపీ నేత

Balineni Srinivasa Reddy: బాలినేనికి డోర్స్ క్లోజ్ అయినట్టే! సీఎంఓ ఫైనల్ వార్నింగ్!

Balineni Srinivasa Reddy: బాలినేనికి డోర్స్ క్లోజ్ అయినట్టే! సీఎంఓ ఫైనల్ వార్నింగ్!

టాప్ స్టోరీస్

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు