By: ABP Desam | Updated at : 28 Sep 2022 05:09 PM (IST)
రైల్వే జోన్‌పై అసలు కేంద్రం ప్రకటన ఇదిగో - అనుమానాలన్నీ తీరిపోయినట్లేనా ?
Raiway Zone Issdue : ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ అంశంపై వదంతులు నమ్మవద్దని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే విశాఖలోన డీఆర్ఎం ఆఫీసు పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించామన్నారు. అయితే రైల్వే జోన్‌పై పునరాలోచన ఉంటే ప్రకటిస్తామని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని రైల్వే బోర్డు చెప్పిందని అందుకే రైల్వే జోన్ అంశం ముందుకు కదలడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో విభజన హామీలపై కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా రైల్వే జోన్ సాధ్యం కాదని చెప్పారన్న విషయం బయటకు రావడంతో రాజకీయంగానూ గందరగోళం ఏర్పడింది.
అయితే రైల్వే జోన్ అంశంపై రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం అంతా తప్పుదోవ పట్టించేదేనని.. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని మంత్రి అశ్వనీ వైష్ణవ్ తనతో చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఒక వేళ రైల్వేజోన్ రాకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాసేపటికే రైల్వే మంత్రి వివరణ ప్రకటన ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం 2018లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు జోన్ ఏర్పాటు చాలా సుదీర్ఘ ప్రక్రియ కేంద్రం వాయిదా వేస్తూ వస్తోంది. గత ఫిబ్రవరిలో దేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంట్‌లోనే కేంద్రం తేల్చి చెప్పింది. అయితే ఆల్రెడీ విశాఖ రైల్వే జోన్ ప్రకటించినందున… అది లెక్కలోకి రాదని అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ నేతలు వివరిచారు.
ఆ తర్వాత కూడా రైల్వే జోన్ విషయంలో ముందడుగు పడలేదు. విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించంారన్న కారణంగా అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్‌ను ఒడిషాలో కలిపారు. విశాఖ రైల్వే జోన్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు కానీ వాల్తేర్‌ను రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయని ఆర్థికంగా కూడా భారం కాదని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. డీపీఆర్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌ను ఏర్పాటుచేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని.. తీసుకోవాల్సింది అధికారిక నిర్ణయమేనని చెబుతున్నారు. కానీ రైల్వే జోన్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు నిర్ణయం పెండింగ్‌లో పడుతోంది.
సాధారణంగా కేంద్ర కేబినెట్ రైల్వే జోన్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న వెంటనే... పనులు ప్రారంభిస్తారు. కానీ విశాఖ రైల్వే జోన్ విషయంలో ఐదేళ్లుగా ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో.. కేంద్రానికి ఇష్టం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది . ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో.. కేంద్ర రైల్వే శాఖ కూడా నాన్చుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది - రైతులకు భువనేశ్వరి భరోసా !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
Tiger Nageswara Rao Trailer: గజదొంగగా మాస్ మహారాజ వీరవిహారం, ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ట్రైలర్ చూశారా?
/body>