TDP Twitter Hack : టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ఇప్పుడు అందులో ఏం పోస్టులు ఉన్నాయంటే ?
తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. టైలర్ హెబ్స్ అనే ఆర్టిస్టు.. తన పోస్టుల్ని అందులో పోస్ట్ చేస్తున్నారు.
TDP Twitter Hack : తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న వారికి హఠాత్తుగా ఆ ఖాతా కనిపించడం మానేసింది. ఏం జరిగిందా ఆ పార్టీ అభిమానులు కాస్త చూసేసరికి.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. తన పేరు పెట్టుకున్నారు. తాను ఆర్టిస్టులనని చెప్పి బయో కూడా మార్చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అఫీషియట్ ట్విట్టర్ హ్యాండిల్‌కు @jaitdp పేరుతో ఖాతా ఉంది. అయితే హఠాత్తుగా టైలర్ హెబ్స్ అనే వ్యక్తి పేరు ప్రత్యక్షమయింది. అతను వరుసగా టీట్టీలు, రీట్వీట్లు చేసుకుంటూ పోయారు. అయితే ఇవేమీ అసభ్యకరంగా లేవు. తాను ఆర్టిస్టులనని బయోలో ప్రకటించుకున్న టైలర్ హెబ్స్.. అన్నీ ఆర్టుల్ల్నే పోస్ట్ చేశాడు.
It felt like a good day to collect some wonderful art :) https://t.co/yUSSfI3Ldg
— Tyler Hobbs (@tylerxhobbs) September 28, 2022
ఒంటి గంట వరకూ తెలుగుదేశం ట్విట్టర్ ఖాతాలో ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించిన కల్యాణమస్తు పథకంపై ట్వీట్ చేశారు.
రోజు మొదలు పెట్టటమే ఫేక్ ప్రచారంతో మొదలు పెట్టారు, ఫేక్ ఫెలోస్..
— Tyler Hobbs (@JaiTDP) October 1, 2022
2017లో మొదలైన ఈ పధకం 2019 మార్చ్ వరకు కొనసాగింది.
మొత్తం 66,538 జంటలకు, రూ.269 కోట్లు పెళ్లికానుక కింద చంద్రబాబు గారు ఇచ్చారు.
ఆ తరువాత వచ్చిన ఒక ఫేక్ ఫెలో, ఈ పథకాన్ని రద్దు చేసాడు. (1/3) https://t.co/ouqjVLgYYw
ఆ తర్వాత ఖాతా టైలర్ హెబ్స్ చేతికి వెల్లింది. ఆయన ప్రతి నాలుగైదు నిమిషాలకు ఓ ట్వీట్ చేస్తున్నారు. టైలర్ హబ్స్ తన వర్జినల్ ట్వీట్స్‌ను రీట్వీట్ చేస్తూ రీచ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Straight, sharp edges juxtaposed with swooping curves. I love the emergence of square-shaped regions, each of them filled with circles in a way that produces different textures. The mix of large and small circles, and the way they are colored creates an overriding sense of depth.
— Tyler Hobbs (@tylerxhobbs) September 27, 2022
గతంలోనూ ఓ సారి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. రెండు రోజుల పాటు శ్రమించి ఖాతాను మళ్లీ పునరుద్ధరించుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. ట్విట్టర్ ఖాతా నిర్వహణ నాసిరకంగా ఉందని.. సులువుగా హ్యాక్ చేసేలా ఉండటంతో హ్యాకర్లు టార్గెట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.. ట్విట్టర్ హ్యాండిల్‌ను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు టీడీపీ సోషల్ మీడియా ఖాతాలు చూసే నిపుణులు ప్రయత్నిస్తున్నారు.