అన్వేషించండి

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, దర్శనం టికెట్లు పెంచుతూ నిర్ణయం

సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం అదనంగా దర్శన టోకెన్లను జారీ చేయనుంది. 23వ తేదీ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్లను అదనంగా జారీ చేయనుంది.

తిరుమలకు పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్ధం వస్తుంటారు. తిరుమలకు వచ్చిన భక్తులకు వివిధ రూపాల్లో టీటీడీ దర్శనాలు కల్పిస్తుంది. అయితే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జీత సేవల ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. కరోనా‌ మహమ్మారి ముందు వరకూ ఈ పద్దతిలో దర్శనాలు సాగాయి. కోవిడ్ వచ్చాక తిరుమలలో పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తుంది. పరిమిత సంఖ్యలో ఆన్లైన్ లో విడుదల చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ ఆర్జీత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులను తిరుమలకు అనుమతిస్తుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా సర్వదర్శనాన్ని టీటీడీ‌ గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీ‌ నుంచి పూర్తిగా నిలిపివేసింది. 

తిరుమలకు చేరుకుని అఖిలాండం వద్ద నుంచి స్వామి వారిని ప్రార్ధించాలనే ఉద్దేశంతో కొందరు భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. ఇలా తిరుపతికి చేరుకున్న భక్తులు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది నిలిపివేస్తుంది. దీంతో సామాన్య భక్తులు ఏమి చేయలేక తీవ్రంగా మనోవేదనకు గురై తిరిగి వారి గమ్యస్థలానికి చేరుకుంటున్నారు. మరికొందరైతే కోవిడ్ సమయంలో స్వామి వారి దర్శనం పొందలేక పోతున్నామే అని బాధకు గురవుతున్నారు. అయితే టీటీడీ ఈవో, టీటీడీ ఛైర్మన్ కు ఫోన్ ద్వారా, విన్నతి పత్రాల రూపంలో సామాన్య భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ ద్వారా సర్వసర్శనం టిక్కెట్లను రోజుకు 15 వేల టోకెన్ల చొప్పున ఈ నెల 16వ తేదీ నుంచి సర్వదర్శనాన్ని టీటీడీ పునః ప్రారంభించింది. 

కోవిడ్ వ్యాప్తి కారణంగా తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శనం టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి రద్దు చేసింది టీటీడీ. ప్రస్తుతం ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్నది భక్తుల ఆవేదన. ఈ క్రమంలో సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయాలని అనేకసార్లు భావించిన కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది టీటీడీ. అయితే ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఈ నెల ఆఫ్ లైన్ లో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో రోజుకి 15,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ. 

అయితే సామాన్య భక్తుల సౌకర్యార్థం మరి‌కొన్ని టోకెన్లు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్లను అదనంగా జారీ చేయనుంది. ఇప్పటి వరకూ ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను 12,000 వేల టోకెన్లు జారీ చేస్తుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ అదనంగా రోజుకి 13,000 చొప్పున టిక్కెట్లు జారీ చేయనుంది. అదే విధంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ లో తిరుపతిలోకి భూదేవి, శ్రీనివాసం, శ్రీ గోవిందరాజ స్వామి సత్రాల్లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అయితే మార్చి నెల‌కు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్ల కోటాను ఈనెల 23న ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది టీటీడీ. మార్చి నెల‌కు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున స‌ర్వద‌ర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని కౌంట‌ర్ల ద్వారా కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
Breaking News: విజయవాడలో కాల్ మనీ రాకెట్– ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్‌లపై సీఎంకు కేశినేని నాని లేఖ
విజయవాడలో కాల్ మనీ రాకెట్– ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్‌లపై సీఎంకు కేశినేని నాని లేఖ
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Embed widget