Ramana Dikshitlu Controversy : టీటీడీపై ఉద్దేశపూర్వక ఆరోపణలు - రమణదీక్షితులపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల విమర్శలు
Ramana Dikshitlu : టీటీడీపై రమణదీక్షితులు చేసిన విమర్శలపై ప్రస్తుత ప్రధాన అర్చకులు విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
![Ramana Dikshitlu Controversy : టీటీడీపై ఉద్దేశపూర్వక ఆరోపణలు - రమణదీక్షితులపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల విమర్శలు TTD current Chief Priests have criticized Ramana Dikshitulu criticism of TTD Ramana Dikshitlu Controversy : టీటీడీపై ఉద్దేశపూర్వక ఆరోపణలు - రమణదీక్షితులపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల విమర్శలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/22/c3c63506c49003cbbd779ef31b2712e31708589374932228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ramana Dikshitlu Controversy : టీటీడీపై రమణదీక్షితులు చేసినట్లుగా ఉన్న విమర్శల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రమణధీక్షితులు ఆరోపణలు పై ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ధీక్షితులు,కృష్ణశేషాచల ధీక్షితులు స్పందించారు. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తూన్నామని.. రమణధీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టిటిడి పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రంగనాయకులు మండపంలో రమణధీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారని స్పష్టం చేశారు.
ఆలయంలో తవ్వకాలు జరగడం లేదు !
ఆలయంలో తవ్వకాలు జరుగుతున్నాయని రమణదీక్షితులు చేసిన ఆరోపణల్ని ప్రధాన అర్చకులు ఖండించారు. లో రమణధీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారన్నారు. ఆలయంలో తవ్వకాలు అంటు రమణధీక్షితులు తరుచూ ఆరోపణలు చేస్తూన్నారని విమర్శించారు. రమణధీక్షితులును సియం జగన్ నాలుగు సంవత్సరాలు క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినా విధులుకు హజరుకావడం లేదు. రమణధీక్షితులు కుటుంభంలో ఎవ్వరూ విధులుకు హజరుకావడం లేదు…జీతాలు మాత్రం తీసుకుంటున్నారని విమర్శించారు.
రమణదీక్షితులు కూడా లుంగీ, టీషర్ట్ వేసుకున్నారు !
టీషర్ట్ ,లుంగి ధరిస్తే క్రిస్టియన్ గా పేర్కోన్న రమణధీక్షితులు….ఆరోపణలు చేసే సమయంలో ధరించినవి కూడా టీషర్ట్,లుంగియ్యేనని ప్రధాన అర్చకులు గుర్తించారు. టిటిడి ఉదాశినంగా వ్యవహరిస్తూండడంతోనే రమణధీక్షితులు తరుచు ఆవాస్త ఆరోపణలు చేస్తూన్నారని మండిపడ్డారు. రమణధీక్షితులు పై టిటిడి చర్యలు తీసుకోని భక్తుల మనోభావాలను కాపాడాలని కోరారు. రమణ ధీక్షితులు హయాంలోనే ఆలయంలో మరమ్మతలు జరిగాయన్నారు. శ్రీవారి ఆలయంలో నిత్యం ఆగమశాస్రబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తూన్నామని స్పష్టం చేశారు.
రమణదీక్షితులు ఏమన్నారంటే ?
పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆ వీడియోలో రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి క్రిస్టియన్ అంటూ అందులో ఆరోపించారు. ఆయన వేషభాషలు చూస్తేనే అర్థమైపోతుందని కామెంట్ చేశారు. అక్కడి నుంచి మొదలైన వీడియోలో చాలా అంశాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీలో చాలా మంది క్రిస్టియన్‌లు ఉండటమే పెద్ద సమస్య అని రమణ దీక్షితులు అన్నారు. ఈఓ ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్, సీఎం జగన్మోహనరెడ్డి క్రిస్టియన్ అని అన్నారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు ఖననం చేశారని అన్నారు. ఆయనను చూస్తేనే తెలుస్తుంది కదా, బొట్టు కూడా పెట్టుకోడు. వేషధారణ, మాట కూడా అంతే ఉంటుందని అన్నారు. ఇంకా చాలా తీవ్రమైన ఆరోపణలతో వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇవి తాను చేయలేదని రమణదీక్షితులు ఖండించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)