News
News
X

Breaking News Telugu Live Updates: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, సెప్టెంబర్ 27న ప్రారంభం

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

FOLLOW US: 
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, సెప్టెంబర్ 27న ప్రారంభం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 27వ తేదీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన గరుడ సేవ, అక్టోబర్ 2 బంగారు రథం, అక్టోబర్ 4 మహా రథం, అక్టోబర్ 5న చక్రస్నానంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని టీటీడీ తెలిపింది. సెప్టెంబర్ 27వ తేదీన సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని, బ్రహ్మోత్సవాలు సమయంలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తామని తెలిపింది. 

TRSలో చేరనున్న గ్రేటర్ వరంగల్ నగరంలోని ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు

గ్రేటర్ వరంగల్ నగరంలోని ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు.. టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు 
నగరంలోని 27 డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ టీఆరెస్ లో చేరుతున్నట్లు విశ్వసనియమైన సమాచారం 
మరొక మహిళ కార్పొరేటర్  కూడా ఈ రోజు సాయంత్రం లోపు చేరునున్నట్టు సమచారం

Tirupati News: తిరుపతి కోర్టులో ఎంపీ సుబ్రమణ్యస్వామికి చుక్కెదురు

తిరుపతి : తిరుపతి కోర్టులో ఎంపీ సుబ్రమణ్యస్వామికి చుక్కెదురు

ఓ పత్రికకు వ్యతిరేకంగా టీటీడీ వేసిన కేసులో వాదనలు వినిపించే ప్రయత్నం సుబ్రమణ్యస్వామి చేశారు.

అభ్యంతరం వ్యక్తం చేసిన అపోజిషన్ న్యాయవాది.

లాయర్ పట్టా లేనందున అనుమతి ఇవ్వద్దని న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. కేసు ఈనెల 11కు వాయిదా వేశారు.

AP Movie Tickets Issue: సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

ఏపీలో గత కొన్ని నెలలుగా సినిమా టికెట్ల విక్రయంపై పలు సందేహాలు, వివాదాలు నెలకొన్నాయి. చివరికి ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం హైకోర్టుకు వెళ్లింది. ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమా టికెట్ల కొత్త విధానం అమలు నిలిపేసిన న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది. ఆన్​లైన్లో ప్రభుత్వమే సినిమా టికెట్ల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఎగ్జిబిటర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

AP Minister Kakani: ప్రతిపక్షం నిద్ర లేస్తే మాటలతో అధికార పార్టీపై యుద్ధం: ఏపీ మంత్రి కాకాణి

తిరుపతి : తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి రైతన్న ఆరోగ్యంగా, ఆర్థికంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజా జీవితంలో ప్రజలకు మరింత మేలు చేసేలా జగన్న ఆ దేవుడు దివించాలని వేడుకున్నానని చెప్పారు. ప్రతి పక్షం నిద్ర లేస్తే మాటలతో అధికార పార్టీపై యుద్దంకి దిగుతుందన్నారు. ఈ రోజు ప్రతిపక్షం చేస్తున్న దాడులు ఏ ప్రతిపక్షం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి అన్నారు..

TS TET Results 2022: ఉదయం 11:30 గంటలకు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

TS TET Results 2022 Online Direct Link: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. టెట్ 2022 నిర్వహణకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా షెడ్యూల్ ప్రకారమే టెట్ నిర్వహించింది. రైల్వే రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ (RRB) అదే రోజున ఉందని పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరినా విద్యాశాఖ మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో జూన్ 12న టెట్ నిర్వహించారు. నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. తెలంగాణ టెట్ 2022 ఫలితాలు జూన్ 27న విడుదల కావాల్సి ఉంది. కానీ టెట్ ఫలితాలు జూలై 1కి వాయిదా వేశారు. టీచర్ పోస్టుల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Background

తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. టెట్ 2022 నిర్వహణకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా షెడ్యూల్ ప్రకారమే టెట్ నిర్వహించింది. రైల్వే రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ (RRB) అదే రోజున ఉందని పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరినా విద్యాశాఖ మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో జూన్ 12న టెట్ నిర్వహించారు. నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. తెలంగాణ టెట్ 2022 ఫలితాలు జూన్ 27న విడుదల కావాల్సి ఉంది. కానీ టెట్ ఫలితాలు జూలై 1కి వాయిదా వేశారు. టీచర్ పోస్టుల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడంతో పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఏపీలోని కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లాల్లోని కొన్ని చోట్ల మాత్రం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు, విజయవాడలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. కానీ భారీ వర్ష సూచన లేదు. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర వరుసగా మూడో రోజు పతనమైంది. రూ.110 తగ్గడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890కి పతనమైంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.65,100 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,890, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,650 అయింది. 

ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,890 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండిపై రూ.200 తగ్గడంతో 1 కేజీ ధర రూ.65,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో రూ.200 మేర తగ్గడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.200 తగ్గడంతో నేడు 1 కేజీ వెండి ధర రూ.65,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.