News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో నోటీసులు అందాయని ప్రకటించిన వైసీపీ ఎంపీ

TRS MLAs Poaching Case: తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో తనకు సిట్ నోటీసులు అందాయని ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వెల్లడించారు. 

FOLLOW US: 
Share:

TRS MLAs Poaching Case: మోయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనకు తెలంగాణ సిట్ నోటీసులు అందాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. దిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని వివరించారు ఈ కేసుకు సంబంధించి ఈనెల 29వ తేదీన బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే రామచంద్ర భారతి, నందుతో రఘురామకు పరిచయం ఉన్నట్లుగా సిట్‌ ఆధారాలు గుర్తించింది. 

హాజరుకాకపోతే సీఆర్పీ కింద అరెస్ట్ చేస్తాం..

ఇప్పటికే ఈ కేసులో రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ నిందితులుగా ఉండగా... జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డా. జగ్గుస్వామి, బీడీజేఏస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ ను నిందితల జాబితాలో సిట్ కొత్తగా చేర్చింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గుస్వామి సోదరుడితోపాటు సిబ్బందికి నోటీసులిచ్చింది. జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌కు నోటీసులు జారీ చేసింది. జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సిట్.. ఈసారి కూడా హాజరుకాకపోతే 41-ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించింది.

ఇప్పటికే నందకుమార్ భార్యతోపాటు మరో లాయర్ ప్రతాప్‌కూ సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్‌ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ప్రతాప్‌ హైకోర్టును ఆశ్రయించారు. సిట్‌ దర్యాప్తునకు ప్రతాప్‌ సహకరించాలని ప్రతాప్‌ను అరెస్టు చేయరాదని సిట్‌ను హైకోర్టు ఆదేశిచింది. ఈ కేసులో సీవీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పేరును  నిందితుల జాబితాలో చేర్చింది.  జగ్గుస్వామి, తుషార్‌ వెళ్లపల్లి,  న్యాయవాది బీ శ్రీనివాస్‌ను కూడా నిందితులుగా సిట్‌ చేర్చింది. ఈ మేరకు సిట్‌ కేసులను విచారించే ఏసీబీ కోర్టుకు నివేదిస్తూ మెమో దాఖలు చేసింది. 

జైల్లో ఉన్న నిందితుల్ని మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ 

రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ ఇప్పటికే అరెస్టయ్యారు. వీరు  గత 25 రోజులుగా జైల్లో ఉన్నారు.ముగ్గురు నిందితులు మాట్లాడిన ఆడియో, వీడియోల్లో పలుమార్లు బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్‌ పేర్లు ప్రస్తావించినట్లు ఆధారాలు ఉన్నాయని సిట్‌ హైకోర్టు విచారణ సందర్భంగా చెప్పింది. అయితే ఈ ముగ్గుర్ని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలనుకున్న సిట్ ప్రయత్నాలు ఫలించలేదు.  ముగ్గురు నిందితులను సిట్‌ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నిరాకరించింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇచ్చినందున సిట్‌ అభ్యర్థనను ఆమోదించలేకపోతున్నట్టు ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్‌ తెలిపారు.  

Published at : 25 Nov 2022 03:07 PM (IST) Tags: mp raghurama Telangana News TRS MLAs Poaching Case TRS MLA's Buying Case YCP MP Raghurama

ఇవి కూడా చూడండి

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Tirumala Children Missing: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం, పీఎస్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్

Tirumala Children Missing: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం, పీఎస్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Andhra News : ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు - ఓటర్ల జాబితా అవకతవకలపై పూర్తి స్థాయి పరిశీలన !

Andhra News : ఏపీకి కేంద్ర  ఎన్నికల సంఘం అధికారులు - ఓటర్ల జాబితా అవకతవకలపై పూర్తి స్థాయి పరిశీలన !

CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్

CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Ravi Bishnoi: టీ20 నెంబర్‌ వన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్

Ravi Bishnoi: టీ20 నెంబర్‌ వన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్