Snake in Railway Track: ట్రైన్‌ను ఆపేసిన పాము-అరగంట పాటు రాకపోకలు బంద్, పుత్తూరులో వింత ఘటన
పుత్తూరులో రైల్వే ట్రాక్‌లో పాము ఇరుక్కుపోవటం వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రెండు రైలు పట్టాలు కలిసే పాయింట్లో పాము దూరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున పుత్తూరు రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే సిగ్నల్ పడకపోవడం వల్ల స్టేషన్ మాస్టర్,పుత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ కి విషయం తెలియ జేశారు. సిగ్నల్ పాయింట్ దగ్గర పాము ఉందని తెలుసుకొని క్లియర్ చేశారు. బీసీఎన్ గూడ్స్ ట్రైన్ దాదాపు 30 నిమిషాల వరకు ఆగాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్యాసింజర్ ట్రైన్లు ఏమి లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాము చనిపోయినట్లు రైల్వే అధికారులు నిర్ధరించారు.
అసలు పట్టాల మధ్య గ్యాప్ ఎందుకు..?
రైల్వే ట్రాక్ మధ్య ఖాళీ ప్రదేశాన్ని ఉంచడానికి ఓ కారణం ఉంది. ఇలా గ్యాప్ ఉంచడంలో ఫిజిక్స్ దాగుంది. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల వస్తువులు వ్యాకోచిస్తాయి. అయితే రైల్వే ట్రాక్ మధ్యలో గ్యాప్ ఉంచకుంటే.. పట్టాల మధ్య ఒత్తిడి పెరిగి వంగిపోతాయి. అలా కాకుండా వాటి మధ్య గ్యాప్ ఉంచినట్లయితే.. ఎలాంటి సమస్యలూ తలెత్తవు. అలాగే చలి కాలంలో వస్తువులు సంకోచిస్తాయి. అప్పుడు పట్టాలు కుంచించుకుపోయి ప్రమాదాలు జరుగుతాయి. అలా జరగకుండా పట్టాల మధ్య సిమెంట్ కడ్డీలు వేస్తారు. వీటిని స్లీపర్స్ అని పిలుస్తారు. ఈ స్లీపర్స్ లతో పాటు రైల్వే ట్రాక్‌ల మధ్య రాళ్లు కూడా వేస్తారు. ఇలా చేయడం వల్ల రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు పట్టాలు తప్పిపోకుండా ఉంటాయి.