AP News Developments Today: జనసేన పార్టీ కీలక నేతలతో పవన్ కళ్యాణ్ నేడు అంతర్గత చర్చలు; నేడు సీఎం జగన్ సున్నా వడ్డీ రుణాలు
రేపు రాజమండ్రిలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శుల మీటింగ్ జరగనుంది. అలాగే ఎల్లుండి పార్టీకి చెందిన జిల్లా స్థాయి అధ్యక్షులతో మరో సమావేశం జరగబోతుంది.
ఇప్పటం గ్రామ రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు ఆదివారం నాడు లక్ష చొప్పున పంపిణీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ కీలక నేతలతో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణలపై వారికి దిశానిర్దేశం చెయ్యనున్నారు. ఇది పార్టీ అంతర్గత సమావేశంగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఈ రోజు రైతులకు సున్నా వడ్డీ రుణాలను సీఎం జగన్ బటన్ నొక్కి పంపిణీ చేయనున్నారు.
హైదరాబాద్ లోనే చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. ఈ నెల 30 నుండి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు నిర్వహించే పర్యటనపై పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు.
రాజమండ్రికి బీజేపీ నేతలు
రేపు రాజమండ్రిలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శుల మీటింగ్ జరగనుంది. అలాగే ఎల్లుండి పార్టీకి చెందిన జిల్లా స్థాయి అధ్యక్షులతో మరో సమావేశం జరగబోతుంది. దానితో పాటే బీజేపీ సోషల్ మీడియాకు దిశానిర్దేశం చెయ్యనున్నారు. వీటి ఏర్పాట్లు కోసం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు రాజమండ్రిలోనే గడపనున్నారు.
ఏపీ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి
ఏపీకి కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి రానున్నట్టు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 30న ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్టు వారు చెబుతున్నారు. ప్రస్తుతం సీఎంఓలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి పని చేస్తున్నారు. అలాగే, త్వరలో సీఎంఓలోకి సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ప్రవేశించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతోంది.
నేడు తిరుపతిలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు.