AP News Developments Today: నేడు సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ పర్యటన, పోలీసుల బందోబస్తు
సత్తెన పల్లిలో నేడు పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవలి కాలంలో వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నేడు సత్తెన పల్లిలో పర్యటించనున్నారు.
* ఇంద్ర కీలాద్రిపై రద్దీ భారీగా పెరిగింది. దూర ప్రాంతాల నుండి చేరుకుంటున్న భవానీ మాలధారులతో విజయవాడలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి. ఈ నెల్ 19 వ తారీఖు వరకూ భవానీ మాల విరమణ దీక్షలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం కావడంతో ఈ రద్దీ మరింత పెరిగింది.
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో పలువురు కృష్ణా జిల్లాకు చెందిన కొందరు నేతలు జనసేనలో చేరనున్నారు. జనసేనను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయనడానికి పూనుకున్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా వివిధ విభాగాలకు చెందిన నేతల్ని పార్టీ వైవు ఆకర్షిస్తున్నారు.
నేడు సత్తెనపల్లిలో పర్యటన
సత్తెన పల్లి లో నేడు పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవలి కాలంలో వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నేడు సత్తెన పల్లిలో పర్యటించనున్నారు. దీనితో పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది.
* విజయవాడలో 11 గంటలకు పెద్ద అనౌన్స్ మెంట్ చేస్తానన్నారు కేఏ పాల్. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో బిజీబిజీ గా తిరిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రస్తుతం ఏపీపై దృష్టి సారించారు. మొన్న విశాఖ కోర్టుకు హాజరైన ఆయన నేడు విజయవాడలో ఒక పెద్ద అనౌన్స్ మెంట్ చేస్తానంటున్నారు. నగరంలోని తుమ్మల పల్లి కళాక్షేత్రం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఈ ప్రకటన చేయనున్నారు.
* లంబసింగి లో క్రొత్త పర్యాటక భవనాన్ని ప్రారంభించనున్నారు మంత్రి రోజా.విశాఖ మాన్యంలోని లంబసింగి లో ఏ ఏటికాయేడు పెరుగుతున్న పర్యాటకుల రద్దీ దృష్ట్యా సరికొత్త ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దానిలో భాగంగా ఒక కొత్త పర్యాటక భవనాన్ని నిర్మించింది. దీనిని మంత్రి రోజా ఆదివారం ప్రారంభించనున్నారు.
* నేడు అనంతపురం జిల్లాలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలు
పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అల్లర్లు దమనకాండ అరాచకాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. నేటి వైసీపీ - నాటి తెలుగుదేశం ప్రభుత్వాలు, పార్టీలు రెండూ ప్రోత్సాహంతో వారి పార్టీ ఉనికిని, నాయకులు ఉనికిని కాపాడుకోవడం కోసం అల్లర్లను అరాచకాలను ప్రోత్సహించడం ఆ రెండు పార్టీలకు పరిపాటిగా మారిందని సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు. సంఘటనలపై జిల్లా ఎస్పీ మాట్లాడిన తీరు ఆక్షేపనీయంగా ఉందని ఫ్యాక్షన్ గొడవల వల్లే ఫ్యాక్షన్ పాత కక్షలు వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ పేర్కొనడం పోలీసుల పలాయన వాదంగా సోము వీర్రాజు అభివర్ణించారు. ఫ్యాక్షన్ , పాతకక్షలవల్ల గొడవలు జరిగితే రాజకీయ పార్టీలు ఇందులో ఎందుకు పాల్గొన్నాయని ప్రశ్నిస్తూ,. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ,పోలీసు యంత్రాంగం విఫలమైందని దుయ్యబట్టారు.
* ఇప్పటికైనా రాష్ట్ర డీజీపీ ఈ ఘటనపై స్వయంగా వివరాలు సేకరించి ఆ ప్రాంతాన్ని సందర్శించి జరిగిన సంఘటనలకు కారకులు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా కూడా పునరావృతం కాకుండా కఠినమైన నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.