Tirumala Temple Visit: తిరుమల శ్రీవారి సన్నిధిలో సినీ, రాజకీయ ప్రముఖులు - ప్రతిపక్షాలపై ఎంపీ మార్గాని భరత్ ఫైర్
Tirumala Temple Visit: తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ మార్గాని భరత్, అచ్చెన్నాయుడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సినీ నటి సంఘవి మొక్కులు చెల్లించుకున్నారు.
Tirumala Temple Visit: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సండ్రా వెంకట వీరయ్య, ప్రభాకర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మాలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అలాగే సినీ ని సంఘవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సంఘవి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి సేవలో టిడిపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు..
తిరుమల శ్రీవారిని టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అచ్చెన్నాయుడు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగాయయలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న ఎంపీ మార్గాని భరత్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సొంత అజెండా కోసం, వారి పిల్లల భవిష్యత్తు, జేబులు నింపుకోవడం కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ మార్గాని భరత్ బంధు, మిత్రులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. 2024 లో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రాబోతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యంను తీసుకుని రావడం జరిగిందన్నారు. గతంలో డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఏ సీఎం సంక్షేమంపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గానీ సంక్షేమాలపై అనేక ఆరోపణలు చేస్తున్నారని, వాళ్లు గతంలో చేసిన కార్యక్రమాలు ఏమీ లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నా సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు వేళ్తుంటే చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.
చివరి సారి ఒక్క అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ప్రజలను అడుగుతున్నారని, గత హయాంలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడని ఎంపీ మార్గాని ప్రశ్నించారు. సీఎంగా ఉండి సొంత కుమారుడి చంద్రబాబు గెలిపించుకోలేక పోయాడని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సపోర్టుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ సమయంలో కచ్చితంగా ప్రత్యేక హోదా గానీ, విభజన చట్టం గానీ అమలు చేసే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డేనన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు సొంత అజెండా కోసం, కటుంబాలు, పిల్లల భవిష్యత్తును, జోబుకు నింపుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారని మార్గాని భరత్ విమర్శించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial