అన్వేషించండి

Trimala News: అనూహ్యంగా ఏడుకొండల్లో పెరిగిన భక్తుల రద్దీ- శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు ఎక్కడి వరకూ వేచి ఉన్నారంటే?

భక్తుల అనూహ్యం రద్దీపై వివిధ విభాగాధిపతులతో టిటిడి ఈవో ధర్మారెడ్డి సెట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, పాలు అందిస్తున్నారు.

రెండేళ్ళ తర్వాత శ్రీనివాసుడి దర్శనార్ధం అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేసిన భక్తులతో ఏడు కొండలు కిటకిట లాడుతున్నాయి. వారాంతరాలు కావడంతో కొండపై ఊహించని రీతిలో‌ ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది.  దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదలుకొని, క్యూలైన్స్ పూర్తిగా భక్తులతో నిండి పోయింది. 

విశేష సంఖ్యలో వచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో శేషాచలం మారుమోగుతోంది. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్ధం నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులు క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటలు, రోజులు తరబడి వేచి ఉండి మరి స్వామి ఆశీస్సులు పొందుతుంటారు. కోవిడ్ పూర్తి స్ధాయిలో అదుపులోకి రావడంతో టిటిడి సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ టిక్కెట్లు లేకుండానే భక్తులను కొండకు అనుమతిస్తూ వస్తుంది. ఈక్రమంలో గత కొద్ది నెలలుగా భక్తుల సంఖ్య భారీగా తిరుమలలో కొనసాగుతూ వస్తుంది. 

ప్రస్తుతం పదోవ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులతో తిరుమలగిరులు నిండి పోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1,2 లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి పోవడంతో సర్వదర్శనం క్యూలైన్ లేపాక్షి సర్కిల్ దాటుకుని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా పాత అన్నదాన సత్రం వరకూ చేరింది. పదోవ తరగతి పరీక్షలు పూర్తి కావడం, వారంతరాలు కావడంతో భక్తుల సంఖ్య ఏడుకొండలపై మరింత పెరిగే అవకాశం ఉంది. 

రెండేళ్ళ కాలంలో కోవిడ్ పూర్తి స్ధాయిలో తగ్గడంతో పాత అన్నదానం సత్రం వరకూ రావడం ఇదే మొదటిసారి. వాతావరణంలో మార్పు కారణంగా తిరుమలలో తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు మాత్రం ఏమాత్రం క్యూలైన్స్ నుంచి బయటక రావడం లేదు. భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్స్ వద్ద అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 

భక్తుల అనూహ్యం రద్దీపై వివిధ విభాగాధిపతులతో టిటిడి ఈవో ధర్మారెడ్డి సెట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. క్యూలైన్స్ వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాట్లు చేశారు టిటిడి అధికారులు. మరికొద్ది రోజులపాటు భక్తుల రద్దీ ఏడుకొండలపై కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. 

భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిధి గృహాలు, వసతి భవనాలు, పిఏసీ-1,2,3,4,5 వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు. మరోవైపు చిరుజల్లు కురుస్తుండడంతో ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులకు టిటిడి విజిలెన్స్ సిబ్బంది సూచనలు చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget