By: ABP Desam | Updated at : 05 Jul 2023 11:24 AM (IST)
Edited By: jyothi
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో టికెట్లు, కొని మోసపోయిన భక్తుడు - కేసు నమోదు చేసిన పోలీసులు
TTD News: వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లను ఓ భక్తుడికి అంటగట్టారు. తీరా తిరుమల వెళ్లాక అవి నకిలీ టికెట్లు అని ముఖ్యంగా బ్రేక్ దర్శనానికి బదులుగా ప్రత్యేక దర్శనానికి మాత్రమే వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన కామిశెట్టి వేణు శ్రీవారి దర్శనం కోసం అభిషేక్ అనే ఓ వ్యక్తిని ఆశ్రయించారు. అయితే అతను నాలుగు వీఐపీ టికెట్లు ఇప్పిస్తామని చెప్పి వేణు వద్ద నుంచి రూ. 11 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి శ్రీను ఫోన్ నెంబర ఇచ్చాడు. అతడిని సంప్రదిస్తే మంచిదని చెప్పాడు. భక్తుడు ఆయనను సంప్రదించగా... అతడు ఎం. అశోక్ నాయక్ అనే మరో దళారి నంబర్ ఇచ్చి అతడిని సంప్రదించాలని కోరాడు. భక్తుడు అతని వద్దకు వెళ్లగా నాలుగు ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లను అందజేశాడు. ఏసీ కూడలి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్సు మీదుగా వెళ్తే.. అక్కడ టికెట్ స్కానింగ్ చేసే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కు చెందిన శివ నారాయణ ఉంటాడని.. అతను అన్నీ చూసుకుంటాడన్నారు. శివనారాయణ టికెట్లను స్కాన్ చేసినట్లు నటించి దర్శనానికి పంపించేశాడు. అయితే బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని చెప్పి ప్రత్యే దర్శనానికి పంపిస్తుండడంతో మోసపోయినట్లు గుర్తించిన భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు టికెట్లను పరిశీలించి అవి ఎస్ఆడీ నకిలీ టీకెట్లుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే తిరుమలలో శునకం హల్ చల్ - విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల కన్నెర్ర
తిరుమలలో శునకం హల్ చల్ చేసింది. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకి వచ్చిన కర్ణాటక భక్తులతోపాటు వాహనంలో వారి పెంపుడు కుక్కని తిరుమలకి తీసుకొని రావడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్ట బయలు అయింది. తిరుమలలో వన్య మృగాల సంచారం నేపథ్యంలో శునకాలని కొండ పైకి టీటీడీ నిషేధించింది. స్థానికులు నివసించే బాలాజీనగర్ లో కూడా శునకాలని పెంచడాన్ని కూడా టీటీడీ నిషేధించింది. అయితే కర్ణాటకకి చెందిన భక్తులు వారి టెంపో వాహనంలో కుక్కని తీసుకొచ్చినా.. భద్రతా సిబ్బంది పట్టించుకోక పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. భక్తులు కుక్కని వారి వాహనంలోనే పెట్టుకొని కొండపై చక్కర్లు కొడుతుండగా తీసిన వీడియోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందిపై భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చిరుత సంచారం పెరిగిన నేపథ్యంలో శునకం కోసం చిరుత జనవాసాల్లోకి వస్తే పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అలిపిరి తనిఖీ సమయంలో.. టిటిడి సిబ్బంది గుర్తించి ముందస్తుగానే అనుమతిని నిరాకరించాలని భక్తులు కోరుతున్నారు.
వారం క్రితమే శ్రీవారి ఆలయంపై విమానాలు
తిరుమల శ్రీవారి ఆలయ సమీపం నుంచి గత జూన్ 8న ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు వరుసగా 3 విమానాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. ఈ ఘటనపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలించినట్లు తెలిసింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పై నుంచి విమానాలు వెళ్లకూడదు. దీనిపై గతంలో తితిదే కేంద్ర పౌర విమానయానశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అయినా తాజాగా ఇప్పుడు కూడా మరో విమానం వెళ్లింది.
ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!
TTD News: అక్టోబర్ 29న చంద్రగ్రహణం, 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూత
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత
Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
/body>