అన్వేషించండి

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం: నెయ్యి ఒక్కటే కల్తీనా? మిగిలిన వాటి పరిస్థితి ఏంటి?

Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయానికి వినియోగించే నెయ్యి మాత్రమే కాదు టీటీడీకి వచ్చే అన్ని వస్తువుల నాణ్యత ఎలా పరిశీలన చేస్తారు. దాతలు విరాళంగా అందించే వాటిలో ఏంటి పరిస్థితి?

Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం పుణ్యంగా భావిస్తారు భక్తులు. స్వామి వారిని భక్తులు చూడడం కాదు శ్రీవారే భక్తులను చూసి వారు కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరీ ఎవరిది తప్పు..?
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లడ్డూల్లో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు, కూరగాయలు నూనె కలిసిందని ప్రకటించారు. ఆయన చెప్పిన నిమిషాల వ్యవధిలో రాష్ట్ర కాదు దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ వార్త దావానలంలా మార్చేసింది. ఆ నెయ్యికి సంబంధించిన వివరాలు సైతం టీటీడీ ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రం దిన్డుగల్ కి చెందిన ఏ ఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యి 10 ట్యాంకులు వచ్చింది.. అందులో 6 ట్యాంకులు నెయ్యి బాగుంది. నాణ్యత లేని మరో 4 నెయ్యి ట్యాంకులను పరీక్షలు కోసం నమూనాలు తొలి సారి టీటీడీ నుంచి బయట ల్యాబ్ కు పంపి పరీక్షలు చేయించారు.

అయితే, ఆ పరీక్షల్లో నెయ్యి కల్తీ గా మారిందని.. సాధారణంగా ఉండాల్సిన విలువల కన్నా వేరుగా నివేదికల ద్వారా తేలింది. అందులోను వివిధ కూరగాయలు నూనెలు, చేప నూనె, జంతువుల కొవ్వు ఉందని నిర్ధారణ అయిందని టీటీడీ ప్రకటించింది. అయితే ఈవో ఫిర్యాదు మేరకు తమిళనాడులోని డైరీ పై కూడా అక్కడి అధికారులు తనిఖీలు జరిగాయి. దీంతో ఆ సంస్థ ప్రతినిథులు సైతం మాట్లాడారు. తమకు సంబంధం లేదని.. తాము మంచి నెయ్యి పంపామని.. ఎక్కడైనా పరీక్షలు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరిగినా దానికి కారణం టీటీడీ వద్ద ల్యాబ్ లేదని కాంట్రాక్టర్లు ఇలా నాసిరకం పంపారని ఈవో అంటున్నారు. టీటీడీది తప్పు లేదు.. డైరీ వాళ్లది తప్పు లేదు మరీ ఎవరిది తప్పు.. ఎవరిది బాధ్యత..? అసలు కల్తీ జరిగిందా లేదా అనేది పెరుమాళ్లకెరుక అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇతర ముడి సరుకులపై దృష్టి పెట్టాలి

టీటీడీ టెండర్ విధానం ద్వారా వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంది. వీటి అన్నింటిని టీటీడీ మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో గోడౌన్ లో ఉంచి వాటిని టీటీడీ సంస్థలకు పంపిణీ చేస్తారు. తిరుమల, టీటీడీ అనుబంధ సంస్థలు అన్నింటికి ఇస్తారు. వీటికి నిబంధనలు, సూచనలు, క్వాలిటీ పరీక్షలు చేస్తామని టీటీడీ గతంలో చెప్పారు. వాటితోనే స్వామి వారి తో పాటు ఆలయాలకు, భక్తులకు, ఉద్యోగులకు, టీటీడీ ఆసుపత్రులు, విద్యార్థులకు అందిస్తారు. అలాంటి వాటి పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

ఇక దాతలు, భక్తులు ఇచ్చే విరాళం ముడి సరుకుల పరిస్థితి ఏమిటి.. దాతలు ఇచ్చే వాటికి ఎలాంటి పరీక్షలు ఉంటాయి.. నిజంగా దాతలు టీటీడీకి సరిపడే నాణ్యతతో ఇస్తున్నారా.. ఒక వేళ ఇవ్వకపోతే వాటిని ఎక్కడ.. ఎలా తనిఖీ చేస్తున్నారు. నాణ్యత సరిగ్గా లేకపోతే వాటిని ఏమి చేస్తున్నారు అనేవి ప్రస్తుతం భక్తుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు. దీనిపై టీటీడీ కూడా సమాధానం ఇవ్వాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget