అన్వేషించండి

Tirumala Darshan News: ఏడుకొండల్లో తగ్గిన భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీ

శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు.

తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు అర్చకులు దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. బుధవారం రోజు 63,535 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,349 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.96 కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంతో నేరుగా శ్రీనివాసుడి దర్శనంకు భక్తులను టిటిడి అనుమతిస్తుంది. అయితే ఉదయం 6:30 గంటల తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వచ్చిన వారిని 8 గంటల సమయం‌ పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది.  

శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరిచిన అర్చకులు.‌. బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిను మేలు కొల్పుతారు. వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు. అంతకుముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుగుతుంది. దీనికే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. అటుతరువాత శ్రీవారికి గొల్ల హారతి సమర్పించిన తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అట తర్వాత మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి,తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు అర్చకులు. ఈ తంతుతో తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు.  

తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ ,పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. దీంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.  

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. అటుతరువాత తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు.  

శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహిస్తారు. అనంతరం గురువారం తిరుప్పావడ సేవను నిర్వహించిన అనంతరం సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు. అటుతరువాత స్వామి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి శాస్త్రోక్తంగా అర్చకులు పూలంగి సేవను నిర్వహిస్తారు. అటు తరువాత డోలోత్సవం సేవను అద్దాల మండపంలో నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల వల్ల వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి అర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలు అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహిస్తారు. అటు తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Hyderabad Central University: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణంలోని భవనం - వెంట్రుకవాసిలో తప్పించుకున్న కార్మికులు
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
Chandrababu: ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
ఆదర్శజంటకు చంద్రబాబు ఆశీస్సులు - పెళ్లికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
Embed widget