Tirumala Brahmotsavam 2024: స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి
Andhra Pradesh News | ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుమల కొండలు గోవింద నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. స్వామివారు స్వర్ణర్థంపై దర్శనమిచ్చారు.
Tirumala Brahmotsavam Photos: తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం
టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సి సి హెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఇతర అధికారులు స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు.