అన్వేషించండి

TTD News: ప్రతి సోమవారం నిర్వహించే ఆ సేవను టీటీడీ రద్దు చేసింది,‌ ఎందుకంటే?

TTD News: ప్రతి సోమవారం తిరుమలలో నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

TTD News: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం అంటే 20వ తేదీ నవంబర్ 2022వ రోజున 80,294 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 31,554  మంది స్వామి వారికి తల నీలాలు సమర్పించగా, 4.48 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 12  కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికు మూడు గంటల సమయం పడుతోంది. 

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగానే సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. 

అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు.

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతిర "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవ మూర్తుల విగ్రహాలు పరిరక్షణలో‌ భాగంగా టీటీడీ‌ రద్దు చేసింది. అనంతరం  సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

టాప్ హెడ్ లైన్స్

YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Embed widget