అన్వేషించండి

TTD News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

TTD News: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. డిసెంబర్ 8వ తేదీ ఒక్కరోజే 51 వేల 376 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 4.60 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

TTD News: తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న అంటే బుధవారం ఒక్కరోజే 51 వేల 376 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24 వేల 878 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా.. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.60 కోట్లు రూపాయలు లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 4 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనం కోసం దాదాపుగా 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు. దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తారు. 

ఏకాంతంగా కర్పూర నీరాజన సమర్పణం..

శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరిచిన అర్చకులు.‌. బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిను మేలు కొల్పుతారు. వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు. అంతకుముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నీరాజనం సమర్పణ జరుగుతుంది. దీనికే కైంకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరం..

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. ఆ తర్వాత శ్రీవారికి గొల్ల హారతి సమర్పించిన తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థాన్ని అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అటు తర్వాత మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్లపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు. ఈ తంతుతో తోమాల సేవ ప్రారంభం అవుతుంది. ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యథాక్రమం తిరుమంజనం నిర్వహిస్తారు.

శ్రీవారి మూలవిరాట్టుకు నక్షత్ర హారతి..

అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం, అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. ఆ తర్వాత వక్షఃస్ధల లక్ష్మీ, పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి, సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్టుకు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. దీంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహిస్తారు. అనంతరం గురువారం తిరుప్పావడ సేవను నిర్వహించిన అనంతరం సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు.

నేత్రపర్వంగా నిత్య కళ్యాణోత్సవం..

మధ్యాహ్నం 12 గంటలకు అభిజీత్ లగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు. అటు తరువాత స్వామి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి శాస్త్రోక్తంగా అర్చకులు పూలంగి సేవను నిర్వహిస్తారు. ఆ తర్వాత డోలోత్సవం సేవను అద్దాల మండపంలో నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల వల్ల వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి అర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలో వేంచేపు చేస్తారు.  సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలు అలంకరించిన పుష్ప మాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహిస్తారు. అటు తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Kamareddy Crime News: భార్యను వేధిస్తున్న పార్టీ నేత అనుచరుడు.. చెప్పుతో కొట్టుకుంటూ పీఎస్‌కు తీసుకెళ్లిన భర్త
భార్యను వేధిస్తున్న పార్టీ నేత అనుచరుడు.. చెప్పుతో కొట్టుకుంటూ పీఎస్‌కు తీసుకెళ్లిన భర్త
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Embed widget