Tirumala Pallavothsvam: శ్రీవారి ఆలయంలో ఘనంగా పల్లవోత్సవం, వేల సంఖ్యలో భక్తుల హాజరు!

Tirumala Pallavothsvam: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో పల్లవోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వారిని అందంగా ముస్తాబు చేసి కన్నుల పండువగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు ఆలయ అర్చకులు.

FOLLOW US: 

Tirumala Pallavothsvam: తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ మహా ద్వారం తెరిచి, సుప్రభాత సేవతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మేలుకొల్పి ఆగమోక్తంగా స్వామి వారి కైంకర్యాలు నిర్వహించారు అర్చకులు.. స్వామి వారి నిత్య సేవల్లో భాగంగా సహస్ర దీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం నుండి తిరుమాఢ వీధుల్లో ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు.

300 ఏళ్ల నుంచి పల్లవోత్సవం నిర్వహణ..

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. దాదాపు 300 సంవత్సరాల నుండి మైసూరు మహరాజు జ్ఞాపకార్ధంగా పల్లవోత్సవాన్ని టీటీడీ నేటికి నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఉత్సవంలో స్వామి, అమ్మవార్లకు మైసూరు మహారాజు వంశీయులు, కర్ణాటక ప్రభుత్వం ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించారు. ఈ పల్లవోత్సవంలో కర్షాటక ప్రజలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పాల్గొన్నారు. కన్నుల పండువగా జరిగిన పల్లవోత్సవాన్ని చూసి భక్తి పారవశ్యంలో మునిగితేలారు. 

మైసూరు ‌మహరాజు అందించిన కానుకలు..

శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూమి విరాళాలు అందించడంతో పాటుగా, ఆనంద నిలయంలో కొలువైయున్న మూలవిరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, ప్లాటినం, బంగారు, వజ్రలు, కెంపులు, పచ్చలు, మకరం తదితర అముల్యమైన  అభరణాలు బహుకరించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ,ముత్యపు పందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలు అందించి స్వామి వారిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ఆయన ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారు చేసి మైసూరు మహారాజు అందించారు.

ప్రతిరోజూ ఐదు కిలలో నెయ్యితో దీపం..

ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీత హారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మ దీపానికి, మహారాజ దీపానికి ప్రతి రోజు 5 కేజిల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా, అది నేటికి కొనసాగుతుంది. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదే విధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున  ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్ప స్వామి వారు కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు. ఆ తిరుమల వేకంటేశ్వరుడిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు అవుతారు.

Published at : 21 Jul 2022 07:24 AM (IST) Tags: Ttd latest news tirumala latest news Tirumala Pallavothsvam Pallavosthsavam Celebrations TTD Latest Pooja

సంబంధిత కథనాలు

Minister Roja :  మంత్రి రోజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కోల్ కతా అమ్మాయి

Minister Roja : మంత్రి రోజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కోల్ కతా అమ్మాయి

SSLV-D1 Latest Update: ఇక ఆ శాటిలైట్స్ పనికిరావు, SSLV రాకెట్‌లో జరిగిన లోపం ఏంటంటే: ISRO

SSLV-D1 Latest Update: ఇక ఆ శాటిలైట్స్ పనికిరావు, SSLV రాకెట్‌లో జరిగిన లోపం ఏంటంటే: ISRO

Chandrababu Comments: నాడు దేశంలోనే పేరున్న ఏపీ పోలీసులు, నేడు ఖాకీల తీరు దారుణం: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

Chandrababu Comments: నాడు దేశంలోనే పేరున్న ఏపీ పోలీసులు, నేడు ఖాకీల తీరు దారుణం: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

Minister Roja New Car: లంచాలు తీస్కొని కారు కొన్నానట! జబర్దస్త్‌గా ఎన్ని లక్షలు వచ్చాయో చూస్కోండి - రోజా

Minister Roja New Car: లంచాలు తీస్కొని కారు కొన్నానట! జబర్దస్త్‌గా ఎన్ని లక్షలు వచ్చాయో చూస్కోండి - రోజా

RK Roja: ఎంపీ న్యూడ్ వీడియోపై మంత్రి రోజా స్పందన, వాళ్లిద్దర్నీ అంత మాట అనేశారే!

RK Roja: ఎంపీ న్యూడ్ వీడియోపై మంత్రి రోజా స్పందన, వాళ్లిద్దర్నీ అంత మాట అనేశారే!

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్