అన్వేషించండి

TTD News: ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు - సెప్టెంబరు, అక్టోబర్‌లో, తేదీలు ఇవే

ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుడిని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే శ్రీవేంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి 'బ్రహ్మోత్సవాలు'గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి..చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తూ ఉంటుంది. 

అధిక మాసం కారణంగా రెండుసార్లు

ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదుగానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా సెప్టెంబ‌రు 18న ధ్వ‌జారోహ‌ణం, సెప్టెంబ‌రు 22న గ‌రుడ వాహ‌నం, సెప్టెంబరు 23న స్వ‌ర్ణ‌ర‌థం, సెప్టెంబ‌రు 25న ర‌థోత్స‌వం(మ‌హార‌థం), సెప్టెంబ‌రు 26న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నున్నాయి.

న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 19న గ‌రుడ‌వాహ‌నం, అక్టోబ‌రు 22న స్వ‌ర్ణ‌ర‌థం, అక్టోబ‌రు 23న చ‌క్ర‌స్నానం జ‌రుగ‌నున్నాయి.. బ్ర‌హ్మోత్స‌వాల కార‌ణంగా సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు, అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ముంద‌స్తుగా ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌ను నిర్దేశిత వాహ‌న‌సేవ‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల అంకురార్ప‌ణ కార‌ణంగా అక్టోబ‌రు 14న స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
GHMC Offer: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
Ustaad Bhagat Sing Songs : ఉస్తాద్ భగత్ సింగ్ కాలరే ఎత్తరా సాంగ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా మాస్ బీట్
ఉస్తాద్ భగత్ సింగ్ కాలరే ఎత్తరా సాంగ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా మాస్ బీట్
Rajasekhar Gotila Factory : అది చూసి ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం - 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ప్రచారంపై జీవిత రియాక్షన్
అది చూసి ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం - 'రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ' ప్రచారంపై జీవిత రియాక్షన్
Mahindra Thar EMI Plan: మహీంద్రా థార్ కొనడానికి అవసరమైన జీతం ఎంత? EMI, డౌన్ పేమెంట్ వివరాలేంటీ?
మహీంద్రా థార్ కొనడానికి అవసరమైన జీతం ఎంత? EMI, డౌన్ పేమెంట్ వివరాలేంటీ?
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
When will the war stop: పశ్చిమాసియా యుద్ధం ఆపాలన్నా ఆగదు - అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈగో వార్ కూడా స్టార్ట్ !
పశ్చిమాసియా యుద్ధం ఆపాలన్నా ఆగదు - అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈగో వార్ కూడా స్టార్ట్ !
Netflix in Hyderabad: హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget