News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్‌గ్రేషియా ప్రకటన

గాలికి ఒక్కసారిగా భారీ చెట్టు పక్కకు ఒరిగిపోవడంతో ఈ ఘటనలో ఒక భక్తుడు మృతి చెందాడు. మరో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

FOLLOW US: 
Share:

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో అపశ్రుతి జరిగింది. సాయంత్రం కురిసిన పెద్ద గాలి వానకు ఆలయ ఆవరణలో ఉన్న ధ్వజ స్తంభం వద్ద ఉన్న పురాతన రావి చెట్టు కూలిపోయింది. గాలికి ఒక్కసారిగా భారీ చెట్టు పక్కకు ఒరిగిపోవడంతో ఈ ఘటనలో ఒక భక్తుడు మృతి చెందాడు. మరో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్పగా పోలీసులు గుర్తించారు. తిరుపతి స్విమ్స్‌లో మెడిసిన్‌ చదువుతున్న కుమార్తెను చూసేందుకు వచ్చిన గుర్రప్ప.. గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. గుర్రప్ప గతంలో స్విమ్స్‌లో వైద్యుడిగా సేవలందించారని, ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కూలిన రావి చెట్టు వందల ఏళ్ల నాటి రావి చెట్టుగా స్థానికులు చెబుతున్నారు. స్వామివారి ఉత్సవాలకు సిద్ధం చేసిన గజరాజు అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పింది. చెట్టు కూలిపోవడానికి ముందుగానే పసిగట్టిన గజరాజు ఘీంకరించడంతో అప్రమత్తమై పరుగులు తీశామని భక్తులు అంటున్నారు.

చనిపోయిన వ్యక్తికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా - వైవీ సుబ్బారెడ్డి

‘‘గాలి వర్షం వచ్చిన నేపథ్యంలో గోవిందరాజస్వామి ఆలయంలో రావిచెట్టు పడిపోయింది. చెట్టు కూలడంతో కడప జిల్లాకు చెందిన వ్యక్తి డాక్టర్ గుర్రప్ప మృతి చెందారు. ఇది చాలా బాధ కారణమైన ఘటన. అ కుటుంబానికి జరిగిన బాధను భర్తీ చేయలేం. కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నాం. ఒకరికి కాలు, మరొకరికి తలకు మరో ఇరువురి గాయాలు అయ్యాయి. మృతి చెందిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిజేస్తున్నా. వందేళ్ళ నాటి చెట్టు భారీ గాలికి పడిపోయింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

బాణసంచా గోడౌన్‌ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలం, ఎల్లకటవ గ్రామంలో బాణాసంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. బాణా సంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించారు. మరణించిన వారంతూ చాలా పేదవాళ్లని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రోజువారీ కూలీలను సమాచారం తెలుసుకున్న సీఎం… ఈ విధంగా స్పందించారు. ఆయా కుటుంబాను ఆదుకునేలా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఎక్స్‌గ్రేషియాను వారి కుటుంబాలకు అందించాలన్నారు.

Published at : 01 Jun 2023 09:12 PM (IST) Tags: TTD News Tirupati News Ravi tree peepul tree Govindarajaswamy temple

ఇవి కూడా చూడండి

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

TTD News: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ఎనిమిది రోజుల వివరాలు ఇవిగో !

TTD News: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ఎనిమిది రోజుల వివరాలు ఇవిగో !

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

టాప్ స్టోరీస్

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?