అన్వేషించండి

Tirumala: సీఎం కేసీఆర్‌కి బుద్ధి చెప్పే రిజల్ట్ రానుంది - తిరుమలలో కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇవాళ ఉదయం తిరుమల స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అరాచక పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ప్రజలు మనుగోడులో తీర్పు ఇస్తారని మనుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.. ఇవాళ ఉదయం తిరుమల స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు శ్రీవారి ఆశీస్సులు పొందటం సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. ఓ కుటుంబం చేతిలోకి వెళ్లడంతో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని ఆరోపించారు. 

తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని రెండు సార్లు అధికారం చేపట్టారని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారని, అడుగడుగునా ఉద్యమ కారులను అవమానిస్తునే ఉన్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగజార్చారని ఆయన చెప్పారు. అరాచక పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ప్రజలు మునుగోడులో తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క వ్యక్తి కోసం వచ్చిన ఎన్నికలు కావని, తెలంగాణ భవిషత్తు కోసం వచ్చిన ఎన్నికలని, ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్షాన్ని కొనుగోలు చేసి ప్రతిపక్షం లేకుండా సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి బుద్ది చెప్పేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని, కుటుంబ రాక్షస పాలనా నుంచి తెలంగాణను కాపాడాలని ఆయన కోరారు. మునుగోడు ప్రజల తీర్పు శిరసావహిస్తానని, తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం తథ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోనే గడుపుతున్న కోమటిరెడ్డి
ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో గ్రామగ్రామాన పర్యటిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను మారుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలిచేది లేదని స్పష్టం చేశారు.

మునుగోడు ఉపఎన్నిక జరిగిన నెలలోపే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. మునుగోడులో కేసీఆర్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

తాను డబ్బులకు, కాంట్రాక్టులకు అమ్ముడు పోయి బీజేపీలో చేరానని చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. డబ్బులకు అమ్ముడు పోయే వ్యక్తిని అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వాడిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. మునుగోడు ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని, ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఓట్లను అమ్ముకోరని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget