(Source: ECI/ABP News/ABP Majha)
Tirumala News: ఈ టైంలో తిరుమలకు వెళ్లొద్దు! ఆ తర్వాతే రావాలని భక్తులకు టీటీడీ సూచన
TTD latest News: కరోనా పరిస్థితులు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మొదటి నుంచి తిరుమలకు అనూహ్య రీతిలో భక్తులు రావడం జరుగుతోంది.
Tirumala News: తిరుమల శ్రీవారిని (Tirumala Latest News) సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం రోజు 74,497 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,24 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 5.15 కోట్లు రూపాయలుగా ఉంది. ఇక సర్వదర్శనానికి 16 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి దాదాపుగా 15 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి (TTD Special Darshan) మూడు గంటల సమయం పడుతుంది.
అయితే, కరోనా పరిస్థితులు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మొదటి నుంచి తిరుమలకు (Tirumala News) అనూహ్య రీతిలో భక్తులు రావడం జరుగుతోంది. ఈ మధ్యే శ్రీవారి దర్శనానికి దాదాపు 42 గంటల సమయం పట్టిన సందర్భాలూ ఉన్నాయి. మధ్యలో తీవ్రమైన తోపులాటలు జరిగాయి. నేటి (ఆగస్టు 11) నుంచి 15వ తేదీ వరకు సెలవు దినాలు రావడంతో భక్తులు విశేష సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీటీడీ (TTD News) భక్తులు తమ ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరింది.
సెలవు రోజుల్లో రోజుకు సుమారు శ్రీవారి దర్శనానికి లక్ష మంది వస్తున్నారు. అలా లక్ష మందికిపైగా భక్తులు తిరుమలకు (Tirumala News) చేరుకుంటే.. దర్శనానికి (Tirumala Darshan) దాదాపు 12 గంటల నుంచి ఒక రోజు వరకూ పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, పవిత్రమైన పురట్టాసి మాసం (తమిళ నెలల్లో) ఆగస్టు 28 న ప్రారంభమై అక్టోబర్ సెప్టెంబరు నెలాఖరు వరకూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో తిరుమల భక్తుల రద్ధీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.
అందుకని, తిరుమలకు (Tirumala) రావాలనుకుంటున్న వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమలకు పురట్టాసి మాసం తర్వాత రావలసిందిగా టీటీడీ (TTD) విజ్ఞప్తి చేసింది. అధిక రద్దీ ఉన్న రోజుల్లో భక్తులను వారి నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తుంటారు. భక్తులు దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో, క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు అందుకు సంసిద్ధం అయి రావాలని టీటీడీ (TTD) సూచించింది.
నేడు పూలంగి సేవ (Poolangi Seva)
ప్రతి శుక్రవారం శ్రీవారికి అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం (ఆగస్టు 11) మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ (Poolangi Seva) నిర్వహిస్తారు. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు అర్చకులు. దీనినే పూలంగి సేవ (Poolangi Seva) అని కూడా పిలుస్తారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు.
Also Read: Tirumala: ప్రతి వారం సహస్ర కలశాభిషేకం రద్దు చేసిన టీటీడీ, ఎందుకో తెలుసా !
Also Read: 13న మరో అల్పపీడనం, ఇంకో వారం వర్షాలే! భారీ గాలులతో ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD