News
News
X

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

TTD Nrews: డిసెంబర్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది టీటీడీ. బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

FOLLOW US: 
Share:

- డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు..
- బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తెలిపిన టిటిడి..
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం 
- తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావించిన టిటిడి..
- నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభం..
- బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్న టిటిడి..
- ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయించనున్న టిటిడి..
- శ్రీవాణి ట్రస్టు దాతలకు తిరుపతిలోనే గదులు కేటాయింపు.. 
- భక్తులు తమ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి..

తిరుమలకు చేరుకున్న భక్తుల్లో సాధారణ రోజులలో సగటున 70 వేల మంది నుంచి 80 వేల మంది వరకు వస్తుంటే, ఇక వారాంతంలో లక్షకు పైమాటే. కటిక పేదల నుండి కోట్లకు పడగెత్తిన ధనవంతుల వరకూ క్యూ కడుతారు. అయితే శ్రీనివాసుడి దర్శనంను అతి దగ్గరగా కల్పించేందుకు టిటిడి విఐపి బ్రేక్ దర్శనాలను అమలు చేస్తోంది. విఐపి బ్రేక్ దర్శనాకు ప్రారంభించిన మొదట్లో ప్రతి రోజు ఉదయం, సాయంకాల సమయంలో రెండు పూట్ల బ్రేక్ దర్శనాలు కల్పించేది. వీఐపీలు, వివిఐపిలను వారు సిపార్సు చేయబడిన వారికి ప్రత్యేక బ్రేక్ దర్శనాలు కేటాయించి వారిని దర్శనానికి అనుమతించేది టిటిడి. అయితే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరడం, సాయంకాలం సమయంలో విఐపి బ్రేక్ లో దర్శనం‌పొందిన వారే ఉదయం కూడా స్వామి వారి సేవలో పాల్గోంటూ ఉండడంతో సామాన్య భక్తులు ఇబ్బందుకు గురి అయ్యే వారు. 
సామాన్య భక్తులకు అధిక సమయం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని దృష్టిలో ఉంచుకుని అప్పటి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో శుక్ర, శని, ఆదివారాల్లో సాయంకాలం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. దీంతో వారాంతంలో రోజుకి సగటున ఇరవై వేల మందికి పైగా సామాన్య భక్తులకు అదనంగా దర్శనభాగ్యం కలిగింది. అయితే రోజు రోజు పెరుగుతున్న భక్తుల‌ రద్దీ దృష్ట్యా విఐపి బ్రేక్ దర్శనాల్లో సమూల మార్పులు తీసుకుని వచ్చింది టిటిడి. కేవలం గురువారం మాత్రమే సాయంకాలం బ్రేక్ దర్శనంను అమలు చేస్తూ, మిగిలిన రోజుల్లో సాయంకాలం బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటుతరువాత క్రమేణా భక్తు రద్దీ అధికం కావడంతో సాయత్రం బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది టిటిడి.

సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఉదయం పూట మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలను అమలు చేస్తూ వచ్చింది టిటిడి. దీంతో సామాన్య భక్తులు అదనంగా స్వామి వారొ దర్శనం పొందారు. తరువాతి కాలంలో విఐపి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేపడుతూ ఎల్-1,ఎల్-2,ఎల్-3 విధానంను అమలు చేసింది టిటిడి. ఈ విధానంలో విఐపి భక్తులకు హోదా తగ్గట్టుగా వారికి స్వామి వారి దర్శనంను కల్పించేది టిటిడి. ఇందులో విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్టుగా ఐదు వందల రూపాలే అయినా ఒక్కోక్కరికి ఒక్కోలా దర్శనం ఉండడంతో దీనిపై భక్తుల నుండి వ్యతిరేకత రావడంతో పాటుగా ఓ భక్తుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో పాలక మండలి సర్వత్రా విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.‌ కోర్టు ఆదేశాల మేరకు టిటిడి ఈవో బ్రేక్ దర్శనాలపై వివరణ ఇచ్చారు. అటుతరువాత వైసీపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఏర్పడిన పాలక మండలి విఐపి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తూ ఎల్ 1,ఎల్ 2 ,ఎల్ 3 విధానాన్ని రద్దు చేసింది. వాటి స్ధానంలో ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ప్రోటో కాల్ దర్శనం, మిగిలిన వారికి వి.ఐ.పి దర్శనంను టిటిడి నేటికి‌ అమలు చేస్తూ వస్తోంది. 

విఐపి బ్రేక్ దర్శనంలో మార్పులు అందుకేనా..??
ఆనంద‌ నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని తమ జీవిత కాలంలో ఓ‌సారైనా అతి‌దగ్గరగా దర్శించాలని ప్రతి‌ ఒక్కరూ‌ కోరుకుంటూ‌ ఉంటారు. అయితే క్రమంలో టిటిడి‌ పాలక మండలి సభ్యులు, మంత్రులు, ఎంపీ,‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బడా పారిశ్రామిక వేత్తల నుండి సిఫార్సు లేఖలను పొంది స్వామి వారి దర్శన భాగ్యం పోందుతూ ఉంటారు భక్తులు. అయితే ఈ బ్రేక్ దర్శన విధానం ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభం అయ్యి దాదాపు తొమ్మిది గంటల వరకూ కొనసాగుతూ ఉంటుంది. దీంతో స్వామి వారి దర్శన భాగ్యం కోసం రాత్రంతా వేచి ఉండే సామాన్య భక్తులు అధిక సమయం స్వామి వారి దర్శన భాగ్యం కోసం వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడేది. 
టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు స్వామి‌వారి దర్శన భాగ్యంను త్వరితగతిన కల్పించాలని భావించి పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. అయితే‌ ముందు ఈ వీఐఒఇ బ్రేక్‌ దర్శనాలను ఉదయం పది గంటల నుండి అమలు చేయాలని భావించినా, అదే సమయంలో‌ కళ్యాణోత్సవం భక్తులు ఆలయ ప్రవేశం చేసే సమయం కావడంతో‌ కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించింది టిటిడి. దీంతో‌ సాధ్యసాధ్యాలను పరిక్షించేందుకు ఓ కమిటీని వేసిన టిటిడి కమిటీ‌ నివేదిక మేరకూ ఉదయం ఎమినిది గంటల నుండి విఐపి బ్రేక్ దర్శన విధానంను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.‌ అయితే ఈ విధానంను డిసెంబరు ఒకటోవ తారీఖు నుండి ఈ విధానంను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది టిటిడి. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి వెల్లడించింది.‌ ఈ విధానంను అమలు చేయడం ద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉండడమే కాకుండా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని టిటిడి భావించింది. 
ఇక నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ను టిటిడి ప్రారంభించనుంది. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించి టోకెన్లు జారీ చేయనుంది. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయించనుంది టిటిడి. అంతే కాకుండా శ్రీవాణి ట్రస్టు దాతలకు తిరుపతిలోనే గదులు కేటాయించే విధంగా టిటిడి చర్యలు తీసుకుంటుంది. భక్తులు టిటిడి నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోని సహకరించాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.Published at : 29 Nov 2022 08:39 PM (IST) Tags: AP News Tirumala TTD Telugu News Tirupati Tirumala News

సంబంధిత కథనాలు

AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

TTDevasthanams App: శ్రీవారి భక్తులకు అలర్ట్ - టిటిడి సమాచారం ఏదైనా "టీటీ దేవస్థానమ్స్" యాప్ ఉంటే చాలు

TTDevasthanams App: శ్రీవారి భక్తులకు అలర్ట్ - టిటిడి సమాచారం ఏదైనా

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ పాదయాత్రలో అపశ్రుతి, సొమ్మసిల్లి కిందపడ్డ తారకరత్న

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ పాదయాత్రలో అపశ్రుతి, సొమ్మసిల్లి కిందపడ్డ తారకరత్న

Nara Lokesh Yuva Galam: కుప్పం నుంచి ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర

Nara Lokesh Yuva Galam: కుప్పం నుంచి ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర

టాప్ స్టోరీస్

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!

IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!