అన్వేషించండి

Tadipatri Sand Mafia: ఇసుక మాఫియాని అడ్డుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం

Andhra Pradesh News | ఏపీలో ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో తాడిపత్రి ఒకటి. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు రంగంలోకి దిగడం, సీఐతో వివాదం హాట్ టాపిక్ అయింది.

TDP MLA JC Asmith Reddy tries to stop Sand Mafia at Tadipatri | తాడిపత్రి: ఆ నియోజకవర్గంలో నేతలు ఏమి మాట్లాడినా ఏపీ మొత్తం అటెన్షన్ లోకి వస్తుంది. అధికారం ఎవరిది ఉన్న వారికి సంబంధం ఉండదు. వారి స్టైల్లో నేతల మాటలు దూకుడు కొనసాగుతూనే ఉంటాయి. ఒకరికి మించి ఒకరు ఎవరు తగ్గే పరిస్థితి కనిపించదు. ఆ నియోజకవర్గమే తాడిపత్రి. ప్రస్తుతం ఇసుక మాఫియాని అడ్డుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేనే సీన్లోకి దిగడంతో ఒక్కసారిగా స్టేట్ మొత్తం తాడిపత్రి వైపు చూసింది. అసలు తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక మాఫియా కథ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.  

జేసీ ఫ్యామిలీ మార్క్ రాజకీయం : 
జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అంటేనే గుర్తుకువచ్చేది తాడిపత్రి నియోజకవర్గం. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా తాడిపత్రి రాజకీయాన్ని సాసిచ్చింది జేసీ ఫ్యామిలీ. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి (జేసీ బ్రదర్స్) ఈ రెండు పేర్లు తెలియని వారు ఉండరు. అలా వారు తాడిపత్రిని కంచుకోటలాగా మార్చుకున్నారు. 2019 వరకు తిరుగులేదన్నట్లుగా నియోజకవర్గ రాజకీయాలను కనుసైగతో పాలించిన జేసీ ప్యామిలీకి 2019 లో వైఎస్ జగన్ మేనియాలో ఎదురు దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి వేవ్ లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందారు. అక్కడి నుంచి మొదలైన నేతల వార్ నేటికీ కొనసాగుతూనే ఉంది.  
నియోజకవర్గంలో ఇసుక వార్ : 
ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ కేసుల వ్యవహారమే వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ తరలింపునకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఆందోళన చేశారు. పెద్దపప్పూరు మండలం లో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పలు స్టేషన్ల చుట్టూ రోజంతా తిప్పారు. ఇలా ఇసుక అక్రమ రవాణా, కేసుల వ్యవహారమే తాడిపత్రి నియోజకవర్గంలో అప్పట్లో రాజకీయ దుమారం రేపింది. అప్పటి ప్రభుత్వంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కనుసుందరిలోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. వాటిని సాక్షాలతో సహా నిరూపిస్తా అంటే కూడా సవాల్ చేశారు. అనుకున్న స్థాయికి మించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఏకంగా ఇసుక రీచ్‌ల వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చున్నారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు కూడా నమోదు చేశారు. 

అధికారంలోకి వస్తే ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకుంటా: జేసీ 
గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా ను కచ్చితంగా అడ్డుకొని తీరుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తానని చెప్పడం తెలిసిందే. అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక మాఫియా కొనసాగుతూనే ఉంది. దాంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను ఆపివేయాలని చెప్పినప్పటికీ, కొందరు తన మాట పెడచెవిన పెట్టి తమ వర్గంలోని కొందరు కూడా ఇసుకను ఆక్రమంగా రవాణా చేస్తున్నారు. దయచేసి మానుకోండి అని ఒక వీడియోలో సూచించారు. గత ప్రభుత్వంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ప్రత్యక్షంగా పోరాడిన వాడిని నేను. గ్రీన్ ట్రిబ్యునల్ కు హైకోర్టు వరకు వెళ్లి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నానని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా ఇది ఇలాగే కొనసాగితే ఎవరిని ఉపేక్షించేది లేదని బహిరంగంగానే చేసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

ఇసుక అక్రమ రవాణాపై రంగంలోకి దిగిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
తాడిపత్రి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు గెలుపొందిన నాటి నుంచి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై పలు సందర్భాల్లో స్పందిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలోని ఇసుక డంపులు ఇసుక రీచులను కూడా ఎమ్మెల్యే జేసీ ఆస్పత్ రెడ్డి పరిశీలించారు ఇసుక రీచ్ లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు ప్రభుత్వ అధికారులతో స్వయంగా ఎమ్మెల్యేని మాట్లాడి అక్రమంగా ఇసుకను తరలించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండడంతో అస్మిత్ రెడ్డి ఆగ్రహించారు. 

అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా ? 
ఇసుక అక్రమ రవాణాను కట్టడిచేయడంలో భాగంగా జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి ఇసుక తరలింపుపై నిఘా వేశారు. అర్ధరాత్రి సమయాల్లో టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్న వాహనాలు అనుమతులతో తరలిస్తున్నారా లేక అక్రమంగా తరలిస్తున్నారనే దానిపై కాపు కాసి అక్రమంగా తరలిస్తున్న వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆలూరు, సజ్జలదిన్నె, వీరాపురం సమీపం లోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి  పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ల లు జేసీ అస్మిత్ రెడ్డి టీం కంట పడ్డాయి. అస్మిత్ రెడ్డి టీం టిప్పర్ యజమానులు, ఇసుక తరలింపుదారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం, ఇసుక తరలింపుదారుల దాడిలో ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు గాయపడటంతో మరోసారి తాడిపత్రిలో ఇసుక వివాదం చోటుచేసుకుంది.  

ఇసుక టిప్పర్లను సీజ్ చేయకుండా  రూరల్ సీఐ లక్ష్మీకాంత రెడ్డి వదిలిపెట్టారని, తమపై దాడి జరిగినా కేసు నమోదు చేయలేదంటూ అనుచరులు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సిఐ లక్ష్మికాంతరెడ్డికి  ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కేసు నమోదు చేయాలని సూచించారట. ఇదే విషయంతో తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డితో వాగ్వాదం చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్లు ట్రాక్టర్లపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే మాట పెడచెవిన పెట్టి ఇసుక మాఫియాతో కుమ్మక్కై ఇసుక దందాను కొనసాగిస్తున్నాడని జేసి ఆస్మిత్ రెడ్డి ఆరోపించారు. ఇదే వ్యవహారంలో ఎమ్మెల్యేకు సీఐ క్షమాపణ చెప్పేంతవరకు వెళ్లింది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget